Site icon NTV Telugu

Suma: ఇండస్ట్రీకి దూరంగా సుమ.. అదే కారణమా..?

Suma

Suma

Suma:యాంకర్ సుమ.. ఆమె లేనిదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు.. సెలబ్రిటీ ఇంటర్వ్యూ లేదు.. సినిమా ప్రమోషన్స్ ఉండవు. ఆమె వాక్చాతుర్యంతో ఒక షోను టాప్ ప్లేస్ కు తీసుకెళ్లదు ఎంతసేపైనా ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా వినోదాన్ని పంచగలదు. ఆమె లేనిదే టాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రమోషన్స్ లేనట్టే అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అయితే గత కొన్ని రోజులుగా సుమ ఇండస్ట్రీకి దూరంగా ఉందా..? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లు చూసిన ప్రతి ఒక్కరికి ఈ అనుమానం రాకతప్పదు.. ఈ నెలలో మూడు పెద్ద ఈవెంట్లు జరిగాయి. పొన్నియన్ సెల్వన్ , ది ఘోస్ట్, గాడ్ ఫాదర్.. ఈ మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సుమ హాజరు కాలేదు. కనీసం ఈ మూడు సినిమాల ప్రమోషన్స్ లలో ఏ ఒక్క ఇంటర్వ్యూ కూడా ఏ చేస్తున్నట్లు దాఖలాలు లేవు. దీంతో అరే సుమకు ఏమైంది..? ఎక్కడ ఉంది..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆమె సోషల్ మీడియా పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే అని అంటున్నారు నెటిజన్లు.

అవును.. ప్రస్తుతం సుమ వెకేషన్ లో ఉంది. కొన్నిరోజులు షూటింగ్స్ గ్యాప్ తీసుకొని ఆమె మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సుమ ప్లేస్ లో మరొక యాంకర్స్ ను తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇక వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న అక్కడ కూడా ఖాళీగా ఉండకుండా తన యూట్యూబ్ ఛానెల్ కోసం పనిచేస్తుందట.. తన వెకేషన్ ట్రిప్ ను వోల్గ్ గా తీర్చిదిద్ది యూట్యూబ్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. ఇకపోతే సుమ లేని లోటు ప్రమోషన్స్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా ది ఘోస్ట్, గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ ఉంటే చిరు, నాగ్ ను ప్రశ్నలతో తికమకపెట్టేదని, పొన్నియన్ సెల్వన్ ఇంటర్వ్యూలో ఆమె ఉంటే ఆ సందడి వేరుగా ఉండేదని చెప్పుకొస్తున్నారు.

Exit mobile version