“కేజీఎఫ్ : చాప్టర్ 2″తో రాకీ భాయ్ మరోసారి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. యష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 14న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా బుకింగ్స్ కూడా ఇప్పటికే మొదలైపోయాయి. అయితే సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, “కేజీఎఫ్ : చాప్టర్ 2” సినిమా నుంచి కొత్త పాటను విడుదల చేశారు మేకర్స్. “సుల్తానా” అనే టైటిల్ తో రిలీజ్ చేసిన ఈ సాంగ్ “KGF”లోని “ధీర ధీర” సాంగ్ కు కొనసాగింపుగా వచ్చినట్టు అర్థమవుతోంది. రవి బస్రూర్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ హీరో పాత్రకు సంబంధించిన ఎలివేషన్ ను ప్రత్యేకంగా చూపిస్తుంది.
Read Also : Beast : విజయ్ కు ఫ్యాన్స్ కు షాక్… అక్కడ నో రిలీజ్ !
శ్రీ కృష్ణ, పృధ్వీ చంద్ర, అరుణ్ కౌండిన్య, సాయి చరణ్, రవి బస్రూర్ తో పాటు హరిణి పాడిన ఈ సాంగ్ “కేజీఎఫ్ : చాప్టర్ 2” కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. మరి ఈ పాటను సినిమాలో ఎలా, ఏ సందర్భంలో ఉపయోగించారో వేచి చూడాల్సిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో విడుదల కానుంది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, రవీనా టాండన్, సంజయ్ దత్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.
