Site icon NTV Telugu

SVP Pre Release Eevent: ‘నేనొక్కడినే’ రోజులు గుర్తుచేసిన సుకుమార్

Sukumar

Sukumar

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతున్న విషయం విదితమే. ఈ ఈవెంట్ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిధిగా విచ్చేశారు సుకుమార్. ఆయన చేతుల మీదుగా మ.. మ.. మహేశా సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. “మహేష్ బాబును ఇప్పటివరకు ఇంత జోష్‏ఫుల్ గా చూడలేదు. మీతోపాటు సినిమా చూడటానికి నేను ఆసక్తిగా ఉన్నాను. సెట్‏లో డైరెక్టర్స్ అందరికీ మహేష్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు.. సెట్ లో మహేష్ ఉంటే .. డైరెక్టర్ కింగ్ లా ఉంటాడు.  ‘నేనొక్కడినే’ రోజులు నేను ఎప్పటికి మర్చిపోలేను.  ఆ సినిమాకు మీరు ఎంత ఆదరించారో.. ఇప్పుడు కూడా  ఆదరిస్తున్నారు.  సర్కారు వారి పాట సినిమా పెద్ద సూపర్ హిట్ అవుతుంది” అని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు హీరోకాగా సుకుమార్ దర్శకత్వంలో 1నేనొక్కడినే సినిమా తీసిన విషయం విదితమే. ఆ రోజుల్లో సినిమా నిరాశపర్చిన ఇప్పటికి అది మహేష్ కెరీర్ లోనే కల్ట్ కక్లాసిక్ గా నిలిచింది.

Exit mobile version