Pushpa The Rule Shooting: పుష్ప 2 ది రూల్ షూటింగ్ అప్‌డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమంటే ఐటెం సాంగ్స్ ఎక్స్ పర్ట్ గా పేరున్న సుకుమార్ స్పెషల్ సాంగ్ షూట్ లో బిజీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ రెండో భాగం మీద అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. అలా దేశంలోనే సినీ ప్రేక్షకులు అత్యధికంగా ఎదురుచూస్తున్న సీక్వెల్‌స్ లలో పుష్ప2 ఒకటిగా మారిపోయింది. ఇక ఇప్పటికే ఈ రెండో భాగం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది, అల్లు అర్జున్ & రష్మిక సరికొత్త షెడ్యూల్‌లో కూడా పాల్గొంటున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్ట్‌లో సుకుమార్ భారీ పార్టీ సాంగ్ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. నిజానికి ఒక్కమాటలో చెప్పాలంట సుకుమార్ ఒక ఐటమ్ సాంగ్స్ ఎక్స్ పర్ట్ అని అందరికీ తెలుసు. సుకుమార్ సినిమాల్లో వచ్చే ఐటెం సాంగ్స్ అన్నీ మనందరికీ సుపరిచితమే.
Maya Petika Review: పాయల్ రాజ్‌పుత్ ”మాయాపేటిక” మూవీ రివ్యూ
ఇప్పటి వరకు ఆయన సినిమాల్లో చేసిన పాటలన్నీ మరీ ముఖ్యంగా సమంత నటించిన పుష్ప 1లోని ‘ఊ అంటావా’ పాట అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. అదేవిధంగా ఈ రెండో భాగంలోని పాట కూడా పార్టీ సాంగ్‌గా ఉండనుందని అంటున్నారు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ శర జరుగుతుండగా పార్ట్ 1 లో ఉన్నట్టే పుష్ప పార్ట్ ఈ విషయం మీద హీరోయిన్ రష్మిక హింట్ ఇస్తూ, తన ఇంస్టాగ్రామ్ స్టోరీ అదే పెట్టగా ఆ స్టోరీ లో సెట్ చూస్తే ఐటెం సాంగ్ ను తలపిస్తోంది. దీంతో పుష్ప 2 లో కూడా ఐటెం సాంగ్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయినట్టు అయింది.. అయితే ఈ ఐటెం సాంగ్ ఎవరు చేస్తున్నారో మాత్రం మూవీ యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, అయినా అనేక మంది భామల పేర్లు తెర మీదకు వచ్చాయి అనుకోండి.
