Sukumar daughter to take music course in USA: ఒకప్పుడు లెక్కల మాస్టారుగా పనిచేసిన సుకుమార్ ఇప్పుడు డైరెక్టర్ గా మారి వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో సుకుమార్ చేసిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడమే కాక ఇండియా వైడ్ గా మంచి వసూళ్లు కూడా రాబట్టడంతో సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారు. దానిని మించి అనేలా ఈ రెండో భాగాన్ని తెరకెక్కించే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి పుష్ప రెండో భాగానికి చెందిన స్పెషల్ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సెట్ లో షూట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది. రెండు వారాల పాటు సుకుమార్ అందుబాటులో ఉండని నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. సుకుమార్ అమెరికాకు వెళ్లబోతున్నారు, అది కూడా తన కుమార్తె కోసం.
Mahaveerudu Review: మహావీరుడు రివ్యూ
సుకుమార్ కుమార్తె అమెరికాలో మ్యూజిక్ కోర్స్ నేర్చుకుంటున్న నేపద్యంలో కుమార్తెతో పాటు సుకుమార్ భార్య కూడా వెళ్లబోతున్నారు. వారితో కలిసి సుకుమార్ కూడా అమెరికా వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సుకుమార్ దర్శకత్వ రంగంలో దూసుకు పోతూ ఉండగా ఆయన కుమార్తె మాత్రం సంగీతం మీద దృష్టి పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సంగీత రంగంలో సుకుమార్ కుమార్ కుమార్తె ఆసక్తి చూపించడంతోనే ఆమెకు అమెరికాలో మ్యూజిక్ కోర్స్ చేయించాలని సుకుమార్ భావించినట్లు తెలుస్తోంది. ఇక పుష్ప రెండవ భాగంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ తో పాటు పలువురు బాలీవుడ్ అలాగే దక్షిణాదికి చెందిన నటీనటులు కూడా భాగమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఊర్వశీ రౌతేలా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.