Site icon NTV Telugu

Sukanya: మహేష్ బాబు రీల్ తల్లి రెండో పెళ్లి.. ?

Mahesh

Mahesh

Sukanya: సీనియర్ నటి సుకన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయుడు సినిమాలో.. పెద్ద కమల్ హాసన్ హత్య చేసి రావడమే భార్య బట్టలు సర్దేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ భార్య ఎవరు అనుకుంటున్నారు సుకన్యనే. ఈ సినిమా ఆమెకు ఎంత మంచి పేరును తీసుకొచ్చి పెట్టిందో అందరికి తెల్సిందే. ఈ సినిమానే కాదు.. పెద్దరికం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సుకన్య అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే శ్రీధరన్ అనే వ్యక్తిని పెళ్లాడిన ఆమె సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. ఇక వివాహ బంధంలో అడుగుపెట్టిన సుకన్య ఎక్కువ కాలం అందులో ఉండలేకపోయింది. భర్తతో విబేధాలు కారణంగా అతడి నుంచి విడిపోయి అమెరికాలో ఉంటున్న ఆమె ఇండియాకు వచ్చేసి ఒంటరిగా నివసిస్తోంది. ఇక ఇండియాకు వచ్చిన సుకన్య రీ ఎంట్రీ ఇచ్చి హీరోలకు తల్లిగా, అత్తగా మంచి మంచి సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

a href=”https://ntvtelugu.com/movie-news/ntr-mokshagna-latest-pic-viral-in-social-media-432223.html”>NTR-Mokshagna: అన్నదమ్ముల అనుబంధం.. ఏం ఉన్నార్రా బాబు

ముఖ్యంగా శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు కు తల్లిగా నటించి మంచి గుర్తింపును అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. 50 ఏళ్ల వయస్సులో సుకన్య రెండో పెళ్లి అంటూ సోషల్ మీడియా లో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఇక ఈ పుకార్లపై ఆమె స్పందించింది. ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చింది. ” ఈ వయస్సులో నాకు రెండో పెళ్లా.. ? ఇప్పటివరకు నాకు ఆ ఆలోచన లేదు. అయినా ఈ వయస్సులో నేను పెళ్లి చేసుకొంటే నాకు పుట్టబోయే పిల్లలు నన్ను అమ్మా అని పిలుస్తారా.. ?అమ్మమ్మ అని పిలుస్తారా.. ? అని నేను ఆలోచిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుకన్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version