OG : పవన్ కల్యాణ్ ఓజీ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అందించింది. పవన్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకున్నారో ఇందులో అలాగే కనిపించాడు. దాంతో మూవీపై మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఇప్పటికే రూ.252 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఇంకా థియేటర్లలో ఆడుతోంది. అయితే ఈ సినిమా చేయక ముందు త్రివిక్రమ్ సుజీత్ గురించి చెప్పినప్పుడు.. అతని గురించి తెలుసుకున్నారు పవర్ స్టార్. అతను కథ చెప్పిన విధానం, అతని ఐడియాలజీని నమ్మి పవన్ ఒప్పుకున్నారు.
Read Also : The Rajasaab : రాజాసాబ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..?
ఆ తర్వాత పవన్ కోసం తమన్ కూడా రంగంలోకి దిగాడు. వాళ్లిద్దరిపై పవన్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. సుజీత్ డైరెక్షన్ ను ఎలివేట్ చేయడానికి తమన్ అందించిన మ్యూజిక్ మంచి ప్లస్ అయింది. ఈ ఇద్దరిపై పవన్ పెట్టుకున్న నమ్మకాన్ని వారిద్దరూ నిలబెట్టుకున్నారు. అందుకే పవన్ కల్యాణ్ ఈ సినిమా విషయంలో చాలా ఖుషీగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత చిరంజీవి, రామ్ చరణ్, సాయిదుర్గాతేజ్, వైష్ణవ్, అకీరా, ఆద్య, వరుణ్ అందరూ కలిసి ప్రసాద్ ల్యాబ్ లో మూవీ చూశారు. ఇక్కడే పవన్ కల్యాణ్ సుజీత్, తమన్ చేతులను పైకెత్తి ఇచ్చిన ఫోజు అందరినీ ఆకట్టుకుంది. వారిద్దరూ తన నమ్మకాన్ని నిలబెట్టారు కాబట్టే ప్రత్యేకంగా వారితో అలాంటి ఫోజు ఇచ్చారనే టాక్ నడుస్తోంది.
Read Also : OG : పవన్ ను చూస్తే గర్వంగా ఉంది.. చిరు పొగడ్తలు
