Suhasini Maniratnam: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు గా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, కార్తీ, జయం రవి లాంటి స్టార్ హీరోలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముదనకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రం బృందం చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పొంగే నది అంటూ ఒక సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా చోళ చోళ అంటూ సాగే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఇక ఈ వేదికపై సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ “నా పుట్టింటికి మా వారు వచ్చారు. తెలంగాణ ఆంధ్ర నా పుట్టింటికి ఆయన అతిధిగా వచ్చారు. అందుకే వారిని గౌరవించాలి. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు మీరు మంచి సపోర్ట్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. అందరు చెప్తున్నారు.. పొన్నియన్ సెల్వన్ సినిమాను మీ ఆయన చాలా కష్టపడి తీశారు. మీరు కొంచెం ఆయన దగ్గర మంచిగా ఉండండి అని.. ఒకే ఒక్క చిన్న కరెక్షన్ ఆయన ఈ సినిమాను కష్టపడి తీయలేదు.. ఇష్టపడి తీశారు. నేను కూడా చాలాసార్లు అడిగాను. ఇది మీ డ్రీమ్ ప్రాజెక్టా అని.. అదేం లేదు. ఈ సినిమా అంటే నాకు ఇష్టం.. అందుకే చేశాను అని చెప్పేవారు. కష్టపడి ఏమి చేయలేదు.. కష్టమంతా ఏమి తెలియదు. ఇష్టపడి చేస్తేనే మీరందరూ ఇష్టపడతారు. మీరు ఇష్టపడాలి.. ఎందుకంటే నేను ఆయనను ఇష్టపడ్డాను. ఆయన ఈ ఫిల్మ్ ను ఇష్టపడ్డారు కాబట్టి మీరు ఈ సినిమాను ఖచ్చితంగా ఇష్టపడాలి. వేరే ఛాయిస్ లేదు. ఈ సినిమాకు మీరందరూ సపోర్ట్ చేయండి” అంటూ చెప్పుకొచ్చారు.
