Suhani Bhatnagar Death Reason Revealed by his father: దంగల్ చిత్రంలో రెజ్లర్ బబితా ఫోగట్ చిన్ననాటి పాత్రను పోషించిన సుహాని భట్నాగర్, కేవలం 19 ఏళ్ల వయసులోనే అనారోగ్యానికి చికిత్స పొందుతూ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించారు. అయితే ఆమె ఒంట్లో నీరు చేరడం వలన మరణించింది అంటే చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం సుహాని చేయి వాచిపోయి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం ప్రారంభమైనట్లు చెబుతున్నారు. అప్పుడు డెర్మాటోమయోసిటిస్ వ్యాధి కారణంగా, శరీరంలో నీరు (ద్రవం) నింపడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఇక నిన్న సాయంత్రం అజ్రౌండా శ్మశానవాటికలో సుహాని అంత్యక్రియలు జరిగాయి. సెక్టార్ 17 నివాసి సుహానీ భట్నాగర్ ఆరేళ్ల వయసులో దంగల్ లో నటించి వెలుగులోకి వచ్చింది, అనేక యాడ్స్ లో కూడా కనిపించింది. ఆమె ప్రస్తుతం మాస్ కమ్యూనికేషన్ చదువుతోంది.
Premalu: మలయాళ ‘ప్రేమలు’.. తెలుగోళ్ళు కూడా హైదరాబాద్ ను ఇంత బాగా చూపించలేదు కదరా!
ఇక ఆమె మరణం గురించి తండ్రి పునీత్ భట్నాగర్ తన చేతులపై ఎర్రటి దద్దుర్లు కారణంగా అలెర్జీ అని భావించానని, ఆ తర్వాత అతను ఫరీదాబాద్‌లోని చాలా ఆసుపత్రులలో చికిత్స అందించామని చెప్పాడు. పది రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. తన కూతురు డెర్మటోమయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోందని తండ్రి పునీత్ భట్నాగర్ తెలిపారు. రెండు నెలల క్రితం కూతురు చేతిపై ఎర్రటి మచ్చ ఏర్పడిందని, తమ కూతురు ఎలర్జీతో బాధపడుతోందని, ఆ తర్వాత ఫరీదాబాద్‌లోని చాలా పెద్ద ఆసుపత్రుల్లో ఆమెకు వైద్యం చేయించారని, అయితే ఏ ఆస్పత్రుల్లోని వైద్యులు వ్యాధిని గుర్తించలేకపోయారని ఆయన పేర్కొన్నారు. ఆమె పరిస్థితి విషమించడం ప్రారంభించినప్పుడు, తన కుమార్తెను చికిత్స కోసం మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చినట్టు పేర్కొన్నారు., అయితే అక్కడ కూడా తన కుమార్తె పరిస్థితి మెరుగుపడలేదని, నెమ్మదిగా ఆమె శరీరం నీటితో నిండిపోయిందని అన్నారు. దీంతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఈ లోకానికి వీడ్కోలు పలికిందని అన్నారు.