NTV Telugu Site icon

Suhaas: చిన్న సినిమాకి ఈరోజు హిట్ టాక్ పడుతుందా?

Suhaas

Suhaas

గీతా ఆర్ట్స్ 2 నుంచి సుహాస్ హీరోగా తెరకెక్కిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో. ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి రానున్నా ఈ సినిమా ట్రైలర్ తో మంచి బజ్ జనరేట్ చేసింది. ఈ మూవీని ఫిబ్రవరి 2 కన్నా ముందు ఫిబ్రవరి 1నే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈరోజు ప్రీమియర్స్ ని వేయనున్నారు మేకర్స్. సెలెక్టెడ్ ఏరియాస్ లో ప్రీమియర్స్ వేస్తే… వచ్చే పాజిటివ్ టాక్ సినిమాకి హెల్ప్ అవుతుంది అనేది మేకర్స్ ఆలోచన. పాజిటివ్ టాక్ వస్తే అది రేపటి నుంచి అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో సినిమా కలెక్షన్స్ ని హెల్ప్ అవుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన బేబీ, హాయ్ నాన్న, మంగళవారం, కీడాకోలా, మ్యాడ్, సామజవరగమన, సార్, పద్మభూషణ్ లాంటి సినిమాలకి ప్రీమియర్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ఈ సినిమాలు ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఆడియన్స్ సూపర్ హిట్ చేసారు. ఇటివలె రిలీజైన హనుమాన్ కూడా ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోని, బాక్సాఫీస్ ని షేక్ చేసిందే.

ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అయ్యి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. అయితే ఈ ప్రిమియర్స్ నుంచి హిట్ టాక్ వస్తే పర్లేదు కానీ ఇదే నెగటివ్ టాక్ వస్తే మాత్రం సినిమాకి ఊహించని నష్టం కలిగే అవకాశం ఉంది. గుంటూరు కారం సినిమా విషయంలో జరిగింది ఇదే. మాస్ సినిమా అనుకోని మిడ్ నైట్ షోస్ చూడడానికి వెళ్లిన ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యి నెగటివ్ టాక్ ని స్ప్రెడ్ చేసారు. ఆ తర్వాత పండగ రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి కదిలి వెళ్లడంతో గుంటూరు కారం టాక్… నెగటివ్ నుంచి డివైడ్ కి మారింది. సో ఈ పెయిడ్ ప్రీమియర్స్ వలన మంచి ఎంత జరుగుతుందో చేదు కూడా అంతే జరుగుతుంది. మరి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా విషయంలో ఈ ప్రీమియర్స్ ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.