NTV Telugu Site icon

Sudigali Sudheer: గాలోడు గట్టి ఆఫర్ నే పట్టేశాడే..?

Sudheer

Sudheer

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వరుస షోలు చేస్తూ బిజీగా మారాడు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సుధీర్ హీరోగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పటికే సుధీర్ నటించిన గాలోడు సినిమా మంచి టాక్ ను అందుకొని కలక్షన్స్ ను కూడా రాబట్టింది. దీంతో సుధీర్ రేంజ్ ఓ మేరకు పెరిగిందనే చెప్పాలి. గాలోడు తో పాటు రిలీజైన ఒక స్టార్ హీరో సినిమా కంటే ఈ సినిమానే అధిక వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇకపోతే సుధీర్ కు ఈ సినిమా తరువాత ఒక మంచి అవకాశం వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగార్జున తో రగడ సినిమా తీసిన వీరు పోట్ల, సుధీర్ తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్దమయ్యాడట.

ఇప్పటికే సుధీర్ ను కలిసి వీరు పోట్ల కథను వినిపించాడని, సుధీర్ కు కూడా కథ నచ్చడంతో ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. నాగ్ కెరీర్ లో రగడకు ఒక ప్రత్యేకమైన స్తానం ఉంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేనప్పటికీ నాగ్ మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకొంది. ఇక సునీల్ తో ఈడు గోల్డ్ ఎహే సినిమా తీసిన వీరు పోట్ల ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇన్నాళ్లకు ఈ రచయిత కమ్ డైరెక్టర్ సుధీర్ తో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తోంది అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments