Site icon NTV Telugu

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పాన్ వరల్డ్ సినిమా.. టైటిల్ ఇదే!

Sudigali Sudheer

Sudigali Sudheer

మెజీషియన్‌గా కెరీర్ మొదలుపెట్టి, జబర్దస్త్‌తో కమెడియన్‌గా గుర్తింపు సంపాదించిన సుధీర్, తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సుధీర్ హీరోగా పలు సినిమాలు చేశాడు. అందులో కొన్ని బ్రేక్ ఈవెన్ కూడా అయ్యాయి. ఇప్పుడు సుధీర్ కెరీర్‌లో హీరోగా ఐదవ సినిమా అనౌన్స్‌మెంట్ రాబోతోంది. రేపు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుడిగాలి సుధీర్ ఇప్పటివరకూ చేసిన నాలుగు సినిమాలు తెలుగు సినిమాలే. తర్వాత పాన్ ఇండియా కూడా చేయకుండా, ఈసారి ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారంటూ ఒక ప్రకటన వచ్చింది.

Also Read :Actor Vijay: తొక్కిసలాట డీఎంకే కుట్ర.. సీబీఐ దర్యాప్తు కోసం కోర్టుకు విజయ్..

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రామ్ చరణ్ అభిమానిగా చెప్పుకుంటూ, రామ్ చరణ్ యువశక్తి అనే ఒక సంస్థ స్థాపించి, మెగా అభిమానుల్లో గుర్తింపు సంపాదించిన శివ చెర్రీ, ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్నాడు. అయితే, టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ, పలు విదేశీ భాషలలో ఆ టైటిల్‌ని రాసి షేర్ చేశారు. దాన్ని చూసి డీకోడ్ చేయమని కోరారు. ఇక సినీవర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమా టైటిల్ హైలెస్సో అని అంటున్నారు. ఇక డీకోడ్ చేయమని ఇచ్చిన ఫోటోలో, కత్తికి గజ్జలు కట్టి కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాని వజ్రవారాహి సినిమాస్ బ్యానర్ మీద నిర్మించబోతున్నారు. పాన్ వరల్డ్ సినిమా అంటే, ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు మరో ఫారెన్ లాంగ్వేజ్‌తో రిలీజ్ చేస్తేనే దాన్ని పాన్ వరల్డ్ అంటారు. మరి సుధీర్‌ సినిమాని విదేశీ భాషలలో రిలీజ్ చేస్తారో చూడాలి.

Exit mobile version