Site icon NTV Telugu

Sudigali Sudhir : హిందూ దేవుళ్లను అవమానించిన సుడిగాలి సుధీర్..?

Sudigaali Sudheer

Sudigaali Sudheer

Sudigali Sudhir : సుడిగాలి సుధీర్ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. ఓ షోలో హిందూ దేవుళ్లను అవమానించాడు అంటూ హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సుధీర్ కు బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ ఉంది. ఆ పాపులారిటీతో హీరోగా సినిమాలు చేశాడు. కానీ సినిమాల్లో సక్సెస్ రాకపోవడంతో తిరిగి బుల్లితెరపై ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. ప్రముఖ ఛానెళ్లలో ప్రోగ్రామ్స్ కు హోస్ట్ గా చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ షోలో చేసిన పని కాస్త తీవ్ర విమర్శలకు దారి తీసింది. యాంకర్ రవితో పాటు ఆయన హోస్ట్ గా చేస్తున్న షోలో.. స్టేజిపైకి నందీశ్వరుడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. సాధారణంగా శివుడి ఆలయాలలో నందీశ్వరుడి విగ్రహాలు ఉంటాయి. నందీశ్వరుడి తలపై భాగం నుంచి శివుడిని చూసి భక్తులు తరిస్తుంటారు.

Read Also : Somu Veerraju: మంత్రి పదవిపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు… 2014లోనే..!

ఈ షోలో మాత్రం నందీశ్వరుడి తల భాగం మీదుగా సుధీర్ రంభను చూస్తాడు. వెనకాలే ఉన్న రవి.. ఏంటి బావ స్వామివారు దర్శనం అయ్యారా అంటాడు. నాకేంటి అమ్మోరు దర్శనం అవుతోంది అంటూ రంభను చూసి చెప్తాడు సుధీర్. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వారంతా.. హిందూ దేవుళ్లను అవమానించడం అందరికీ అలవాటు అయిపోయింది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన నందీశ్వరుడి తల మీదుగా చూస్తే.. వీళ్లకు రంభ కనిపిస్తోందంట అంటూ తిడుతున్నారు. అయితే సుధీర్ ఫ్యాన్స్ మాత్రం ఇదంతా సినిమా స్పూఫ్ అంటూ చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి పనులు చేయొద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కేవలం వ్యూస్ కోసం ఇలా దేవుళ్లపై కామెడీ స్క్రిప్టులు రాయడం మంచిది కాదంటూ చురకలు అంటిస్తున్నారు.

Exit mobile version