Sudheer Varma: పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ కథతో సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravanasura: తొలి చిత్రం ‘స్వామి రారా’తో అందరి దృష్టిలో పడ్డాడు దర్శకుడు సుధీర్ వర్మ. ఆ తర్వాత పలు చిత్రాలను రూపొందించినా, ఆ స్థాయి విజయం మాత్రం అతనికి దక్కలేదు. ‘దోచేయ్, రణరంగం, శాకినీ డాకిని’ చిత్రాలు నిరాశ పర్చగా, ‘కేశవ’ మాత్రం ఫర్వాలేదనిపించింది. దాంతో అతని తాజా చిత్రం ‘రావణాసుర’ మీదనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. అభిషేక్ నామాతో పాటు రవితేజ కూడా ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం విశేషం. సుశాంత్ తో పాటు ఐదుగురు అందాల భామలు కీలక పాత్రలు పోషించిన ‘రావణాసుర’ ఈ నెల 7న జనం ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సుధీర్ వర్మ తన మనసులోని మాటలను మీడియాకు వెల్లడించారు.
కథ రివీల్ చేయకుండా మాట్లాడుతూ, “‘రావణాసుర’ సూపర్ ఎక్సయిటెడ్ గా వుంటుంది. సినిమాలో థ్రిల్స్, షాకింగ్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా వుంటాయి. అందులో ఏది రివీల్ చేసినా సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ వుండదు. ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వడానికే దానిని హోల్డ్ చేస్తున్నాం. ఇక రవితేజ విషయానికి వస్తే… ఆయనతో సినిమా చేయాలన్నది ఎప్పటి నుండో ఉన్న ప్లాన్. అయితే ఫలానా జోనర్ సినిమా చేయాలని ముందుగా ఏమీ అనుకోలేదు. అయితే శ్రీకాంత్ విస్సా ఈ కథ చెప్పిన్నపుడు రవితేజ గారికి నచ్చి, నేనైతే బావుంటుదని నా దగ్గరికి పంపించారు. కథ విన్నప్పుడు నాకు ఎక్సయిటింగా అనిపించింది. ఇలాంటి థ్రిల్లర్ ని ఓ పెద్ద హీరో చేయడం ఇంకా ఎక్సయిటెడ్ గా అనిపించింది. ‘రావణాసుర’ వంద శాతం కొత్త జోనర్ మూవీ. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం” అని అన్నారు.
Also Read
- Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
- Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
- Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
ఇందులో హీరోని గ్రే షేడ్స్ లో చూపించడం గురించి చెబుతూ, “గ్రే షేడ్స్ అనేది చాలా కాలంగా వుంది. ‘అంతం’లో నాగార్జున, ‘సత్య’లో జేడీ ఇవన్నీ గ్రేనే! ఇవి ఎప్పటి నుంచో వున్నాయి. అయితే ఈ మధ్య అవి ఎక్కువగా పెరిగాయి. ఇక మణిరత్నం గారి ‘రావణ్’కు ఈ కథకు ఏం సంబంధం లేదు. మణిరత్నం గారు ఎగ్జాట్ గా రామాయణం తీశారు. అయితే ఇందులో నా హీరో పాత్రకి రావణాసుర పేరు సరిగ్గా నప్పుతుందని అలా పెట్టాం తప్పితే నేను రామాయణంలోకి వెళ్ళలేదు. అయితే రావణాసుర అనే పేరు పెట్టిన తర్వాత దానికి తగ్గట్టు కొన్ని డైలాగులు యాప్ట్ అయ్యాయి, కొన్ని వాడుకున్నాం తప్ప రామాయణంతో సంబంధం లేదు” అని వివరణ ఇచ్చారు. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో మాత్రమే విడుదల చేస్తున్నట్టు సుధీర్ వర్మ క్లారిటీ ఇచ్చారు. ఆ విషయం చెబుతూ, “హిందీ, తమిళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలని ముందు అనుకున్నాం. కానీ అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి పదిహేను రోజులు ముందు కాపీ పంపించాలి. అయితే మేము ఏదైతే దాస్తూ వచ్చామో ఆ ఎలిమెంట్స్ బయటికి వచ్చేస్తాయనే భయంతో ముందు తెలుగులోనే విడుదల చేస్తున్నాం. సెకండ్ వీక్ నుంచి హిందీలో ప్లాన్ చేస్తున్నాం” అని తెలిపారు. పవన్ కళ్యాణ్ తోనూ సుధీర్ వర్మ మూవీ చేయబోతున్నారనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. దాని గురించి చెబుతూ, “అది త్రివిక్రమ్ గారి కథతో వుంటుంది. అయితే ఎప్పుడు ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది” అని బదులిచ్చారు.
తాజావార్తలు
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!