టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. పలువురు స్టార్ హీరోలు ఒకేతెరపై కలిసి నటిస్తే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే తాజా సమాచారం మేరకు మరో సూపర్ మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. యంగ్ హీరో సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబుతో మల్టీస్టారర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also : Alia Bhatt : అల్లు అర్జున్ కోసం పేరు చేంజ్… ఆలు అల్లుతో ఎప్పుడు ?
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో కలిసి సినిమా చేయాలనుకుంటున్నారా ? అనే ప్రశ్న ఎదురైంది సుధీర్ బాబుకు. ఆ ప్రశ్నకు బదులిస్తూ యంగ్ హీరో “చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారు. నేను, మహేష్ ఇద్దరం కలిసి ఒకే చిత్రంలో నటించాలంటే, దానికి తగిన స్క్రిప్ర్ట్ ఉండాలి. ఆ మూవీ నాకు చిరకాల జ్ఞాపకం అవుతుంది. ఎవరైనా మా ఇంటర్వ్యూ వింటారని, మా ఇద్దరినీ ఒకచోట చేర్చే మంచి స్క్రిప్ట్‌ను వ్రాస్తారని నేను ఆశిస్తున్నాను. మహేష్ కు విలన్ గా అయినా, మరో హీరోగా అయినా నటించడానికి నాకు ఓకే” అంటూ దర్శకనిర్మాతలకు హింట్ ఇచ్చేశాడు సుధీర్ బాబు. మరి వీరిద్దరితో మల్టీస్టారర్ తీయడానికి ఎవరు రెడీ అవుతారో చూడాలి.
ప్రస్తుతం సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇక సుధీర్ సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు చెల్లెలు అయిన ప్రియదర్శిని ఘట్టమనేనిని వివాహం చేసుకున్నాడన్న విషయం తెలిసిందే.
