Site icon NTV Telugu

సుధీర్ బాబు, హర్షవర్ధన్ తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సినిమా ప్రారంభం

sudheer babu

sudheer babu

ఆసక్తికరమైన సినిమాలతో రాబోతున్న హీరో సుధీర్ బాబు 15వ చిత్రం షూటింగ్ ఆరంభం అయింది. నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఎం. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావుతో కలిసి శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

https://ntvtelugu.com/vijay-devarakonda-goes-to-bandra-restaurant-for-dinner-with-rashmika/

ఇప్పటి వరకూ కనిపించనటువంటి పాత్రలో సుధీర్‌బాబుని ప్రెజెంట్ చేయడానికి హర్షవర్ధన్ భిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఈ వినూత్నమైన సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కి క్లాప్‌ కొట్టిన నిర్మాత పుస్కూర్ రామ్‌మోహన్‌రావు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Exit mobile version