NTV Telugu Site icon

Sudheer Babu: సుధీర్ అన్నా నువ్వా… సడన్ గా చూసి అల్లరి నరేష్ అనుకున్నాం

Sudheer Babu

Sudheer Babu

పర్ఫెక్ట్ రాక్ సాలిడ్ ఫిజిక్ తో, సినిమాతో సంబంధం లేకుండా మైంటైన్ చేసే ఫిట్నెస్ తో సుధీర్ బాబు కనిపిస్తూ ఉంటాడు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటూ తన బాడీని జిమ్ లో కష్టపెట్టే సుధీర్ బాబు ఇప్పుడు బొద్దుగా అయ్యి పొట్ట పెంచేసాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. కెరీర్ లో మొదటిసారి సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ సినిమాలో మూడు డిఫరెంట్ లుక్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ మూడు పాత్రల పేర్లు దుర్గ, పరశురామ్, డీజే. వీటిలో ‘దుర్గ’ క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేసారు.

Read Also: Taraka Ratna: రేపే తారకరత్న ‘పెద్ద కర్మ’… ముఖ్య ఆహ్వానితులుగా పొలిటికల్ రైవల్స్

లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో సుధీర్ బాబు చాలా లావుగా కనిపిస్తున్నాడు. సడన్ గా ఈ పోస్టర్ చూస్తే అతను సుధీర్ బాబు అని కూడా నమ్మడం కష్టమే. అంత కొత్తగా కనిపిస్తున్న సుధీర్ బాబు, ‘లడ్డు బాబు’ సినిమాలోని అల్లరి నరేష్ ని గుర్తు చేస్తున్నాడు. ప్రోస్తేటిక్స్ వాడి సుధీర్ బాబుని ఇలా లావుగా చూపిస్తున్నాడు దర్శకుడు హర్షవర్ధన్. మిగిలిన రెండు లుక్స్ లో సుధీర్ బాబు ఎలా కనిపిస్తాడు అనేది ఇంకా రివీల్ చెయ్యలేదు కానీ ఇప్పటికైతే మేకర్స్ ‘దుర్గ’ లుక్ తో ఆడియన్స్ అటెన్షన్ అయితే గ్రాబ్ చెయ్యగలిగారు. మరి ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్న సుధీర్ బాబు, ఈ మామా మశ్చీంద్ర సినిమాతో అయిన హిట్ కొడతాదేమో చూడాలి.