Site icon NTV Telugu

Hunt: రెండు వారాలు తిరగకుండానే ఒటీటీలోకి…

Hunt

Hunt

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉన్న సమయంలో, ఇండస్ట్రీలోని పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ కొంతమంది పెద్దలు కలిసి తీసుకున్న నిర్ణయాల్లో ఎనిమిది వారాల ఒటీటీ విండో ఒకటి. థియేటర్ రిలీజ్ కి ఒటీటీ రిలీజ్ కి మధ్య 8 వారాలు గ్యాప్ ఉండాలి, అందరూ ఈ నిర్ణయాన్ని ఓన్ చేసుకోని పాటిస్తే ఇండస్ట్రీ రెవిన్యూ బాగుంటుంది అని మేధావులు చెప్పారు. ఈ మాట చెప్పడం వరకే పరిమితం అయినట్లు ఉంది. సినిమా హిట్ అయితే ఒటీటీ రిలీజ్ కి కాస్త గ్యాప్ మైంటైన్ చేస్తున్నారు కానీ ఫ్లాప్ అయితే మాత్రం పది రోజులు కూడా ఆగకుండా ఒటీటీకి ఇచ్చేస్తున్నారు. అలా రెండు వారాలు కూడా తిరగకుండానే ఒటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘హంట్’

సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ జనవరి 26న ఆడియన్స్ ముందుకి వచ్చింది. A సెంటర్స్ లో పఠాన్ మంచి హోల్డ్ ని మైంటైన్ చెయ్యడంతో హంట్ సినిమాని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లలేదు. ట్రైలర్ తో పర్వాలేదు అనిపించారు కానీ ఆ తర్వాత హంట్ ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. ముఖ్యంగా బీ, సి సెంటర్స్ వరకూ హంట్ సినిమాని తీసుకోని వెళ్లలేకపోయారు ఈ కారణంగానే హంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. నిజానికి హంట్ సినిమా కథ, కథనం అంత గొప్పగా ఉండవు. మలయాళ హిట్ సినిమా ‘ముంబై పోలిస్’ అక్కడి ఆడియన్స్ కి సరిపోయింది కానీ అది మన వాళ్లకి నచ్చలేదు. అయితే సింగిల్ స్క్రీన్స్ లో, బీ-సి సెంటర్స్ లో కథ కాస్త అటు ఇటుగా ఉన్నా యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటే మాస్ ఆడియన్స్ అయినా థియేటర్ కి వస్తాడు. హంట్ విషయంలో అది కూడా జరగలేదు. దీంతో అన్ని వర్గాల ఆడియన్స్ హంట్ సినిమాకి దూరం అయ్యారు. ఇప్పుడు హంట్ మూవీ ఆహాలో ప్రీమియర్ అవుతుంది అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అదేంటి రెండు వారాలు కూడా తిరగకుండానే ఒటీటీకి ఇచ్చేస్తున్నారు అని సుధీర్ బాబు ఫాన్స్ షాక్ అవుతున్నారు.

Exit mobile version