Hunt Teaser: సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘హంట్’. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ఇతర ప్రధాన పాత్రధారులు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ఈ రోజు విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచిందని చెప్పవచ్చు. సుధీర్ బాబు యాక్షన్‌కు తోడు సిక్స్ ప్యాక్ తో ఆట్టుకుంటున్నాడు. ‘తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా… ఎంత ఎఫెక్ట్ అయినా… నన్ను ఎవరూ ఆపలేరు’ అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ ఆసక్తిని పెంచుతోంది. సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ సైతం పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్నారు. మరి చనిపోయింది ఎవరు? సుధీర్ అన్వేషణ దేనికోసం అన్నది సినిమాలో చూడాల్సిందే. కబీర్ దుహన్ సింగ్, మౌనికరెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్లా, సత్యకృష్ణన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు కెమెరా: అరుల్ విన్సెంట్, సంగీతం: జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి.
Hunt Teaser: ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు ‘హంట్’ టీజర్
Show comments