Site icon NTV Telugu

Harom Hara: మాస్ సినిమా టీజర్ లాంచ్ చేయనున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ హీరో

Harom Hara

Harom Hara

నైట్రో స్టార్ సుధీర్ బాబు… సినిమా సినిమాకి ఒక యాక్టర్ గా ఎవాల్వ్ అవుతూనే ఉన్నాడు కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. మామా మశ్చీంద్ర, హంట్ సినిమాలు సుధీర్ బాబుని బాగా నిరాశపరిచాయి. ఈ ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయట పడడానికి… మాస్ ఆడియన్స్ ని మెప్పించి సాలిడ్ హిట్ కొట్టడానికి సుధీర్ బాబు ‘హరోం హర’ అనే సినిమా చేస్తున్నాడు. చిత్తూరు యాసలో సుధీర్ బాబు నటించనున్న ఈ మూవీని యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న ‘సెహేరి’ సినిమాని డైరెక్ట్ చేసిన జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు. సుధీర్ బాబు ‘సుబ్రహ్మణ్యం’ అనే పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో జరిగిన పీరియాడిక్ కథతో హరోం హర సినిమా తెరకెక్కుతుంది.

ఈ మూవీ టీజర్ రిలీజ్ కి రెడీ అయిన మేకర్స్… ది పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం అంటూ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. హరోం హర టీజర్ నవంబర్ 27న మధ్యాహ్నం 2:30 నిమిషాలకి రిలీజ్ కానుంది. మల్టీలాంగ్వేజ్ సినిమా కాబట్టి టీజర్ ని ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో రిలీజ్ చేస్తున్నాడు. మలయాళంలో హరోంహర టీజర్ ని సూపర్ స్టార్ మమ్ముట్టి రిలీజ్ చేస్తుండగా… తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హరోంహర టీజర్ ని లాంచ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి హరోంహర టీజర్ ఎలా ఉంటుంది? సుధీర్ బాబుకి ఈ సినిమా ఎంత వరకూ హెల్ప్ అవుతుంది? ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటపడి సుధీర్ బాబు హరోంహర సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.

Exit mobile version