‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’.. నిన్న (ఆగస్ట్ 27) విడుదలైన ఈ సినిమాలో క్లైమాక్స్ బాగుందని ప్రేక్షకుల నుంచి టాక్ వచ్చింది. సుధీర్ బాబు అద్భుతంగా నటించేశారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో ఇది బెస్ట్‌గా అనిపిస్తుందని పలువురు ప్రశంసలు కురిపిస్తోన్నారు. హీరోయిన్ ఆనంది కూడా మంచి మార్కులు కొట్టేసింది.
తాజాగా ఈ సినిమా విశేషాల గూర్చి సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ‘పలాస 1978 చూశాక నాకు సరిపోయే కథ ఉంటే సినిమా చేద్దామని అనుకున్నాను, అది ‘శ్రీదేవి సోడా సెంటర్’ తో కుదిరింది. ఈ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేశారు. ఇది ప్రేమకథ చిత్రంగానే కాకుండా, గ్రామీణ నేపథ్యం కలిగిన భిన్నమైన భావోద్వేగాలు కలిగివున్న సినిమాగా చూడాలి.. కథకు ఏం కావాలో అదే చేశాం, అందుకే మంచి ఫలితం వచ్చింది.
ఓటీటీ విషయమై మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ వాళ్లతో థియేటర్లోకి వెళ్లి సినిమా చూడ్డం అలవాటు అయింది. థియేటర్ స్క్రీన్ మీద నన్ను నేను చూడాలనుకున్నాను. అప్పటి నుంచి థియేటర్లో సినిమా చూడ్డం ఓ కల్చర్ గా మారింది. ఓటీటీలోనే విడుదల చేయాలనీ ఎవరు అనుకోరు, అలాఅనుకుంటే ఎవరు సినిమాలు కూడా చేయరు. ఒకటి, రెండు సందర్భాల్లో అల జరిగి ఉండొచ్చు. కానీ అది పూర్తిగా దర్శకనిర్మాతలపై ఆధారపడి ఉంటుంది. నాని-నేను నటించిన ‘వీ’ సినిమా కూడా అలాగే వచ్చిందే’నని సుధీర్ బాబు తెలిపారు. మరి ఆ పూర్తి ఇంటర్వ్యూను మీరు చూసేయండి.
