Site icon NTV Telugu

Sudheer Babu: ఇది కూడా పోయింది మామా… నెక్స్ట్ అయినా హిట్ కొట్టాలి

Mama Mascheendra

Mama Mascheendra

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు… హీరోగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నైట్రో స్టార్ అనే బిరుదుతో హిట్, ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. చివరగా ‘హంట్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా థియేటర్లోకి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయింది. తాజాగా ‘మామా మశ్చీంద్రా’ అనే సినిమాతో థియేటర్లోకి వచ్చాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. సుధీర్ సరసన ఈషా రెబ్బ, మిర్నలిని రవి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో సుధీర్ బాబు ఏకంగా మూడు విభిన్న పాత్రలో నటించాడు. దుర్గా, డీజే, పరశురాం అనే క్యారెక్టర్స్ చేశాడు. దీంతో మామా మశ్చీంద్ర ఇంట్రెస్టింగ్‌గా మారింది పైగా ఈ సినిమా ట్రైలర్‌ను మహేష్‌ బాబు లాంచ్ చేశాడు. దీంతో సుధీర్ బాబు ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

ఈ సినిమా మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. లావుగా కనిపించిన పాత్రలో సుధీర్ లుక్ అంత బాగాలేదని అంటున్నారు. మొత్తంగా ఇదో కన్ఫ్యూజన్ డ్రామా… రొటీన్ రివేంజ్ స్టోరీ అనే టాక్ సొంతం చేసుకుంది మామా మశ్చీంద్ర. దీంతో సాలిడ్ హిట్ కొట్టాలనుకున్న సుధీర్ బాబుకి మళ్లీ నిరాశ తప్పేలా లేదంటున్నారు. ఇలా అయితే ఇప్పట్లో సుధీర్ బాబుకు హిట్ కష్టమే అంటున్నారు. ప్రస్తుతం సుదీర్ చేస్తున్న రెండు, మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. హరోంహర, పుల్లెల గోపీచంద్ బయోపిక్, మా నాన్న సూపర్ హీరో అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలతోనైనా బాబు కంబ్యాక్ ఇవ్వాలని ఘట్టమనేని అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version