Site icon NTV Telugu

Sudheer babu: తెలుగు, హిందీ భాషల్లో ‘మామా మశ్చీంద్ర’

Sudheer Babu

Sudheer Babu

మే 11వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు, హీరో సుధీర్ బాబు బర్త్ డే! దాంతో అతను నటిస్తున్న సినిమాల పోస్టర్స్ బర్త్ డే విషెస్ తో వస్తున్నాయి. అయితే అందుకు భిన్నంగా సుధీర్ బాబు – హర్షవర్థన్ కాంబినేషన్ లో మూవీని నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి. సంస్థ టైటిల్ ను ప్రకటించింది. ఇప్పటికే సెట్స్ పై ఉన్న ఈ సినిమాకు ‘మామా మశ్చీంద్ర’ అనే పేరు ఖాయం చేశారు. విశేషం ఏమంటే ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. ఎందుకంటే సుధీర్ బాబు ఇప్పటికే బాలీవుడ్ ఆడియెన్స్ కు సుపరిచితుడు. జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘బాఘీ’ చిత్రంలో సుధీర్ బాబు ప్రతినాయకుడిగా నటించి, ఉత్తరాది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. దాంతో ‘మామా మశ్చీంద్ర’ను హిందీలోనూ విడుదల చేయాలనే నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ తీసుకున్నారు.

సుధీర్ బాబు కెరీర్‌లో 15వ సినిమాగా రాబోతున్న దీనిలో అతను ఛాలెంజింగ్ పాత్రను పోషించనున్నారు. సుధీర్ బాబు కోసం ఒక భిన్న‌మైన క‌థ‌ను రెడీ చేశారు ద‌ర్శ‌కుడు, నటుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్‌. ఈ సినిమాలో ఇంత వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవతారంలో సుధీర్ బాబు క‌నిపించబోతున్నాడు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో రాక్ స్టార్ ను తలపించే గెటప్ లో సుధీర్ ఉన్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంతో ప్రముఖ నటీనటులు, సాంకేతిక బృందం భాగస్వామ్య కానున్నారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్ర‌ఫి భాధ్య‌తలు నిర్వ‌హిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్ట‌ర్. ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

Exit mobile version