Site icon NTV Telugu

Narayana & Co: తిక్కల్ ఫ్యామిలీ మెంబర్ గా సుధాకర్ కోమాకుల!

Sudhakar

Sudhakar

Sudhakar Komakula: యంగ్ హీరో సుధాకర్ కోమాకుల ప్రస్తుతం చిన్న పాపిశెట్టి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు… పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. శుక్రవారం ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘నారాయణ & కో’ అనే టైటిల్‌ను పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ హీరో, అతని కుటుంబాన్ని పరిచయం చేస్తోంది. ‘ఎక్స్ పీరియన్స్ ది తిక్కల్ ఫ్యామిలీ’ అని పోస్టర్ పై వుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పోస్టర్ లోని పాత్రధారులంతా పగలబడి నవ్వడం చూస్తుంటే, ఇదో విలక్షణమైన కుటుంబ కథా చిత్రమని అనిపిస్తోంది. ఆమని, దేవి ప్రసాద్ ఇద్దరు అబ్బాయిల తల్లిదండ్రులుగా నటించారు. ‘నారాయణ & కో హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్థమౌతోంది. ఆమని, దేవి ప్రసాద్, జై కృష్ణ, పూజా కిరణ్, ఆరతి పొడి, యామిని బండారు, సప్తగిరి, అలీ రెజా, శివ రామచంద్రపు, తోటపల్లి మధు, రాగిణి, అనంత్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగవంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్ సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చాడు. రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా, రాజీవ్ కె డైలాగ్ రైటర్. సృజన అడుసుమిల్లి ఎడిటర్. శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాత, రవి దొండపాటి ఆర్ట్ డైరెక్టర్.

Exit mobile version