NTV Telugu Site icon

Suchitra Krishnamoorthi: ఇష్టంతో పెళ్లి చేసుకుంటే.. మోసం చేసి వెళ్లిపోయాడు

Suchitra On Shekhar Kapoor

Suchitra On Shekhar Kapoor

Suchitra Krishnamoorthi Says Shekhar Kapoor Cheated On Her: సాధారణంగా సినీ తారలు తమ వ్యక్తిగత జీవితాల్ని పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. మంచైనా, చెడైనా.. వాటిని రహస్యంగానే ఉంచుతారు. కానీ.. కొందరు మాత్రం ఆ విషయాల్ని బయటపెట్టేస్తుంటారు. ముఖ్యంగా.. చేదు అనుభవాలు చవిచూసిన తారలు, మనసులో ఆ బాధని దిగమింగుకోలేక ఏదో ఒక సమయంలో వాటిని మీడియాతో పంచుకుంటారు. ఇప్పుడు సింగర్, నటి సుచిత్రా కృష్ణమూర్తి కూడా తన పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్‌తో ప్రేమ, పెళ్లి, విడాకుల విశేషాల్ని రివీల్ చేశారు. 1999లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరు.. కొన్ని కారణాల వల్ల 2007లో విడిపోయారు. ఇప్పుడు ఆ కారణాలేంటో సుచిత్ర వెల్లడించారు. తన మాజీ భర్తలో నిజాయితీ లేదని, ప్రేమించి పెళ్లి చేసుకున్న తనని మోసం చేసి వెళ్లిపోయాడని.. గతాన్ని గుర్తు చేసుకున్నారు.

NTR 31: నీల్-ఎన్టీఆర్ సినిమాకి బ్రేక్ వేస్తున్న సలార్?

సుచిత్ర మాట్లాడుతూ.. తనకు సినీ పరిశ్రమలో ఎవరూ తెలియకపోయినా, ఇష్టంతో సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. అప్పట్లో సినీ పరిశ్రమపై తన తల్లిదండ్రులకు సదుద్దేశం లేకపోవడంతో, తాను అబద్ధం చెప్పి కొచ్చి వెళ్లానని, అక్కడ సినిమాల్లో పని చేశానని అన్నారు. తాను నటించిన చాలా సినిమాలు సూపర్‌హిట్స్‌ అవ్వడంతో తనకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. అదే సమయంలో తనకు శేఖర్‌తో పరిచయం ఏర్పడిందన్నారు. తనకు 10-12 ఏళ్ల వయసున్నప్పుడు.. తాను పెళ్లంటూ చేసుకుంటే ఇమ్రాన్ ఖాన్ (పాక్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని) లేదా శేఖర్ కపూర్‌నే పెళ్లి చేసుకోవాలని అనుకునేదాన్నని చెప్పారు. అంతలా శేఖర్‌ని తాను ఇష్టపడేదాన్నని, ఎట్టకేలకు తాను ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నారు. ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే, జీవితంలో మళ్లీ నీకు కనిపించను’ అని బెదిరించి మరీ.. తానే శేఖర్‌ని పెళ్లి చేసుకున్నానని వివరించారు. అతడ్ని పెళ్లి చేసుకోవద్దని తల్లి తనకు పదేపదే చెప్పేదని, అయినా వినకుండా ఆయన మీదున్న ప్రేమతో పెళ్లి చేసుకున్నానని తెలిపారు.

Fake Kidnap: ఫిల్మ్ నగర్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన యువకుడు

పెళ్లయ్యాక శేఖర్ తనని సినిమాల్లో నటించొద్దని కండీషన్ పెట్టాడని.. తనకు ఆ సమయంలో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, భర్త మాటకు విలువిచ్చి సినిమా అవకాశాల్ని వదులుకున్నానని సుచిత్ర పేర్కొన్నారు. అయితే.. పెళ్లైన కొన్నాళ్లకే శేఖర్ తనని మోసం చేశాడని అన్నారు. తనకు పాప పుట్టిన తర్వాత, కొన్ని సంవత్సరాల వరకు వేచి చూశానన్నారు. ఇక చివరికి జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకుని, శేఖర్ ఎపిసోడ్‌ని తన జీవితంలో నుంచి తొలగించేశానని చెప్పుకొచ్చారు.

Show comments