Site icon NTV Telugu

Telugu Film Chamber: డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ తో చర్చలు సఫలం!

Telugu Film Chamber

Telugu Film Chamber

Telugu Film Chamber : Successful negotiations with digital service providers!

గత కొంత కాలంగా డిజిటల్ ప్రొవైడర్స్ అత్యధిక రేట్లను వసూలు చేస్తున్నట్టుగా నిర్మాతలు విమర్శలు చేస్తున్నారు. సినిమా ప్రదర్శన సమయంలో వేసే వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన లావాదేవీలలో తమకు వాటా ఇవ్వడం లేదని కూడా వారు కినుక వహించారు. తమ కంటెంట్ ను ఆధారం చేసుకుని ప్రకటనలు వేస్తూ, తమకు అందులో వాటా ఇవ్వకపోవడం సబబు కాదన్నది నిర్మాతల వాదన. అయితే తాజాగా తెలుగు నిర్మాతలు సినిమా షూటింగ్స్ ను బంద్ చేసి, ఒక్కో రంగంతోనూ తమకున్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడం మొదలెట్టారు. అందులో భాగంగా ఈ రోజు తెలుగు చలన చిత్ర నిర్మాతలు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ హైదరాబాద్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్స్ తో చర్చలు జరిపారు. ప్రధానంగా వర్చువల్ ప్రింట్ ఫీజు (వి.పి.ఎఫ్.)పై వారి చర్చలు సాగాయి. సముచిత నిర్ణయాన్ని తీసుకునే దిశగా ఆశాజనంగా చర్చలు జరిగాయని సమావేశానంతరం ఛాంబర్ కార్యదర్శి కానూరి దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి తమ నిర్ణయాలను అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

Exit mobile version