NTV Telugu Site icon

Janasena: భోళా శంకర్ రెమ్యునరేషన్ జనసేనకు.. స్టంట్ మేన్ విరాళం

Sri Badri Janasena

Sri Badri Janasena

Stunt man sri badri contibutes to jansena: జనసేనకు స్టంట్ మేన్ శ్రీ బద్రి విరాళం ఇచ్చిన అంశం హాట్ టాపిక్ అయింది. బుధవారం సాయంత్రం స్టంట్ మెన్ శ్రీ బద్రి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో భోళాశంకర్ సినిమాలో చేసిన స్టంట్స్ కి గాను తాను అందుకున్న పారితోషికం రూ. 50 వేలు జనసేన పార్టీకి విరాళంగా అందచేశారు బద్రి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ శ్రీ బద్రికి ధన్యవాదాలు తెలిపారు.

Jagapathi Babu: వయసు పెరిగినా వన్నె తగ్గని అందగాడు

సినిమాల్లో కార్లను పల్టీలు కొట్టిస్తూ చేసే డేర్ డెవిల్ స్టంట్స్ ఎంతో కష్ట సాధ్యమైందని, సాహసంతో కూడుకున్నవి, తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి స్టంట్స్ చేయడం శ్రీ బద్రికి మాత్రమే సాధ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విశాఖలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచి శ్రీ బద్రితో పరిచయం ఉందన్న ఆయన భోళాశంకర్ చిత్రంలో చేసిన స్టంట్స్ కి ఆయన్ని అభినందించారు. ఇక మరో పక్క శ్రీ బద్రి మాట్లాడుతూ “28 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయం నన్ను నిలబెట్టిందని, సార్ చేసే సాయం నాతో ఆగిపోకూడదు ఎందరికో ఆయన సహాయం అందిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే నాలాంటి ఎంతో మందికి అండగా నిలుస్తారని, ఆ ఆకాంక్షతోనే భోళాశంకర్ చిత్రానికి వచ్చిన పారితోషికాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చాను అని అన్నారు.