NTV Telugu Site icon

69th National Film Awards: బన్నీ vs విక్కీ కౌశల్ vs సిద్దార్థ్ మల్హోత్రా vs సూర్య

69th National Film Awards

69th National Film Awards

ఆస్కార్ అవార్డ్ ఏమో కానీ ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటికి నేషనల్ అవార్డ్ అనేది సంవత్సరాలుగా అత్యంత ప్రెస్టీజియస్ అవార్డ్స్ గా నిలుస్తున్నాయి. ఆ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ ఇలా అన్ని కేటగిరిల్లో నేషనల్ అవార్డ్స్ ని ప్రకటిస్తూ ఉంటారు. లేటెస్ట్ గా 2021 సంవత్సరానికి గానూ 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంట్రీలకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ రిలీజ్ అయిన సినిమాలు మే 5వ తారీఖు లోపు www.mib.gov.in నుంచి తమ సినిమాని నేషనల్ అవార్డ్స్ పోటీకి సబ్మిట్ చెయ్యొచ్చు లేదా మే 10లోపు న్యూ ఢిల్లీలోని నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సెల్ కి హార్డ్ కాపీ సబ్మిషన్స్ ఇవ్వొచ్చు. ఇదిలా ఉంటే నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ హీరో కేటగిరిలో భారి పోటీ కనిపిస్తోంది. పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్ గా నటించిన అల్లు అర్జున్ ఈసారి నేషనల్ అవార్డ్ గెలుచుకుంటాడని అందరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఇప్పటివరకూ తెలుగులో ఒక్క హీరోకి నేషనల్ అవార్డ్ రాలేదు, స్పెషల్ మెన్షన్ కేటగిరిలో అక్కినేని నాగార్జునకి మాత్రమే నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆలోటుని భర్తీ చేస్తూ ఏ హీరోకి సాధ్యం కానిది అల్లు అర్జున్ చేసి చూపిస్తాడనే అందరిలోనూ ఉంది కానీ అది అంత ఈజీగా అయ్యే పనిలా కనిపించట్లేదు. ఎందుకంటే 2021 ఇయర్ లో హిందీ నుంచి రెండు సాలిడ్ పెర్ఫార్మెన్స్ లు బెస్ట్ యాక్టర్ రేసులో ఉండేలా ఉన్నాయి. అందులో ఒకటి సర్దార్ ఉద్ధం సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తూ ‘విక్కీ కౌశల్’ ఇచ్చిన పెర్ఫార్మెన్స్. ఈ మూవీలో జలియన్ వాలా భాగ్ సీన్ లో విక్కీ కౌశల్ పెర్ఫార్మెన్స్ ని కొలిచే మీటర్ లేదు అని చెప్తే అతిశయోక్తి కాదు. విక్కీ కౌశల్ తర్వాత బెస్ట్ యాక్టర్ రేస్ లో అంతగా కాంపిటీషన్ ఇచ్చే మరో హీరో ‘సిద్ధార్థ్ మల్హోత్రా’. షేర్షా సినిమాలో ఇండియన్ ఆర్మీ లెజెండ్, కార్గిల్ వార్ హీరో ‘విక్రమ్ బాత్ర’గా అద్భుతంగా నటించాడు సిద్దార్థ్ మల్హోత్రా. ఎస్పెషల్లి క్లైమాక్స్ పోర్షన్స్ లో సిద్దార్థ్ మల్హోత్రా ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టించే రేంజులో పెర్ఫామ్ చేశాడు.

హిందీ నుంచే కాదు సౌత్ నుంచి కూడా అల్లు అర్జున్ కి పోటీ తప్పేలా లేదు. జై భీమ్ సినిమాతో సూర్య, కర్ణన్ సినిమాతో ధనుష్, కళ సినిమాతో టోవినో థామస్, కురూప్ సినిమాతో దుల్కర్ సల్మాన్, హీరో సినిమాతో రిషబ్ శెట్టి, గరుడ గమన వృషభ వాహన సినిమాతో రాజ్ బి.శెట్టి బెస్ట్ యాక్టర్ కేటగిరిలో అల్లు అర్జున్ కి గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు. వీరిలో ధనుష్, రిషబ్ శెట్టిల గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా సూర్య, రాజ్ బి శెట్టి, దుల్కర్ సల్మాన్ ల నుంచి మాత్రం అల్లు అర్జున్ కి టఫ్ ఫైట్ గ్యారెంటీ. మరి 2021లో బెస్ట్ హీరోగా అల్లు అర్జున్, సిద్దార్థ్ మల్హోత్రా, విక్కీ కౌశల్, సూర్య, ధనుష్, రాజ్ బి శెట్టిల్లో ఎవరు నేషనల్ అవార్డ్ గెలుచుకుంటారు అనేది చూడాలి.

Show comments