Site icon NTV Telugu

Flora Saini : పెళ్లి వద్దు.. శృంగారమే ముద్దు.. ఫ్లోరా బోల్డ్ కామెంట్స్

Flora Sainy

Flora Sainy

Flora Saini : ఫ్లోరా సైనీ బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆమె హౌస్ లో ఉన్నంత కాలం డీసెంట్ గా ఉండి ఐదో వారం బయటకు వచ్చేసింది. వాస్తవానికి బిగ్ బాస్ కు వెళ్లిన వారు అంత త్వరగా బయటకు రావడానికి ఇష్టపడరు. కచ్చితంగా టైటిల్ కొట్టాలి అనుకుంటారు. మధ్యలో వస్తే తెగ బాధపడిపోతుంటారు. కానీ ఫ్లోరా మాత్రం అలా కాకుండా బయటకు వస్తే తెగ సంతోషపడింది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నాకు ఎవరితోనూ పెద్దగా కలవడానికి ఇష్టం ఉండదు. నా పనేదో నేను చేసుకుంటాను. ఎవరితోనూ కలవడం, తర్వాత విడిపోవడం అంటే నాకు నచ్చదు అంటూ తెలిపింది.

Read Also : Diwali 2025 Offers: దీపావళి బిగ్ ఆఫర్.. ఒకే ధరకు ఐఫోన్ 15, ఐఫోన్ 13!

ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. నేను పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయ్యాను. నా ఫ్రెండ్స్ ను చాలా మందిని చూస్తున్నాను. వారంతా పెళ్లైన రెండు, మూడేళ్లకే విడాకులు తీసుకుంటున్నారు. అందుకే నాకు పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు. ప్రస్తుతం నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనితోనే డీప్ డేటింగ్ లో ఉన్నాను. మేమిద్దరం లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాం. నా దృష్టిలో పెళ్లి అనేది అనవసర రిలేషన్ అనిపిస్తుంది. పెళ్లికి ముందే డేటింగ్ లో అన్నీ ఉన్నాయి. పెళ్లి చేసుకుని విడిపోవడం కన్నా డేటింగ్ చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేయడమే బెటర్ అనిపిస్తోంది. అందుకే నాకు పెళ్లి వద్దు అని ముందే డిసైడ్ అయిపోయా’ అని తెలిపింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Read Also : Akshay Kumar : డబ్బు, ఫేమ్‌, సక్సెస్‌ సెకండరీ.. మనశ్శాంతే ఫస్ట్‌

Exit mobile version