సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి విదితమే. పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. మహేష్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా గురించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏంటంటే .. ఈ సినిమాకు సంబంధించిన ఓటిటీ హక్కులను ప్రముఖ ఓటిటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నదట.
భారీ ధరతో ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగు వారాల తర్వాత ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కానున్నదని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అమెజాన్ లక్కీ ఛాన్స్ కొట్టిసిందని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి అమెజాన్ కొన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన విషయం విదితమే. అయితే ఎట్టకేలకు సర్కారు వారి పాట విజయం సాధించడంతో అమెజాన్ పంట పండినట్లే అని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
