Millie Bobby Brown: ఎంగేజ్మెంట్ చేసుకున్న 19 ఏళ్ల హాలీవుడ్ హీరోయిన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ట్విట్టర్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికీ ట్రెండ్స్ లిస్టులో ‘She is 19’ అనే ట్యాగ్ వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూ కనిపించి ఉంటుంది. సగం మందికి ఈ ట్రెండ్ ఎందుకు, ఆ ట్యాగ్ ఏంటి అనే విషయం తతెలిసి ఉండదు. వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతున్న ఆ ట్యాగ్ వెనక ఒక మ్యారేజ్ న్యూస్ ఉంది. హాలీవుడ్ యాక్ట్రెస్, “గాడ్జిలా: కింగ్ ఆఫ్ మాన్స్టర్స్”, “ఎనోలా హోమ్స్”, “గాడ్జిలా vs కాంగ్”, ఎనోలా హోమ్స్ 2 లాంటి సినిమాల్లో నటించిన బ్రిటిష్ యాక్ట్రెస్ “మిల్లీ బాబీ బ్రౌన్” ఈరోజు సోషల్ మీడియాలో తన పెళ్లికి సంబంధించిన వార్తని షేర్ చేసుకుంది. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ చూసిన వాళ్లకి మిల్లీ బాబీ బ్రౌన్ బాగా పరిచయం ఉన్న నటి. గత రెండేళ్లుగా పాపులర్ సింగర్ జోన్ బాన్ జోవి కొడుకు, అమెరికన్ యాక్టర్ అయిన ‘జేక్ బొంగియోవి’తో రిలేషన్ లో ఉన్న మిల్లీ బాబీ బ్రౌన్, ఇన్స్టాగ్రామ్ లో బొంగియోవితో ఉన్న ఫోటోని పోస్ట్ చేసి, నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది.
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిల్లీ బాబీ బ్రౌన్ చేతికి ఉన్న ఎంగేజ్‌మెంట్ రింగ్ చాలా మంది కుర్రాళ్ల హృదయాలని ముక్కలు చేసి ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. బాబీ బ్రౌన్, బొంగియోవి ఎంగేజ్మెంట్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు కానీ వారి వయసుల్లోనే అందరికీ సమస్యలు వచ్చినట్లు ఉన్నాయి. ఎందుకంటే బాబీ బ్రౌన్ కి 19 ఏళ్లు, బొంగియోవికి 20 ఏళ్లు. ఈ ఏజ్ లో ఎంగేజ్మెంట్ ఏంటి? అప్పుడే పెళ్లి ఏంటి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెగటివ్ కామెంట్స్ తో పాటు బ్రౌన్ కి మద్దతునిస్తూ కొందరు పాజిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఈ సందర్భంగానే “She is 19” ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!