Site icon NTV Telugu

Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. కారణం అదే!

Attack On Singer Mangli

Attack On Singer Mangli

Stone Attack On Singer Mangli Car In Bellary: ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీకి కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొని వస్తుండగా.. కొందరు దుండగులు ఆమె కారుపై రాళ్ల దాడికి దిగారు. కర్ణాటకలోని బళ్లారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో మంగ్లీ అతిధిగా పాల్గొంది. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని సైతం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆమె తన కారులో తిరిగి బయలుదేరింది. అప్పుడు ఆమె కారుపై కొందరు రాళ్లతో దాడి చేశారు.

Kiren Rijiju: సుప్రీంకోర్టు కన్నా బీబీసీనే ఎక్కువా..? మోదీ డాక్యుమెంటరీపై కేంద్రమంత్రి

అయితే.. ఈ దాడి జరగడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ సింగర్ మంగ్లీ పాల్గొంది. ఆ సమయంలో కన్నడ ప్రజల కోసం కన్నడలో ఏమైనా మాట్లాడాల్సిందిగా యాంకర్ అనుశ్రీ కోరింది. అయితే.. మంగ్లీ మాట్లాడలేదు. అందరికీ తెలుగు తెలుసు కదా అని, తెలుగులోనే మాట్లాడింది. అయినా యాంకర్ వదలకుండా బలవంతం చేయడంతో.. కన్నడలో మంగ్లీ ఒకట్రెండు మాట్లాడిందంతే! ఇది కన్నడ ప్రేక్షకులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు మంగ్లీ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.

Bihar Car Accident: ఢిల్లీ తరహా మరో హారర్ ఘటన.. 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి..

కన్నడ ఇండస్ట్రీలో మంగ్లీ అడుగుపెట్టి రెండేళ్లు అవుతోందని, అయినా ఆమెకు కన్నడ అర్థం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక్కడికి వచ్చి కన్నడలో మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆమెకు అవకాశాలు ఎందుకు ఇస్తారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈ రాళ్ల దాడి వెనుక కారణం కూడా.. మంగ్లీ కన్నడలో మాట్లాడకపోవడమేనని స్పష్టమవుతోంది.

Exit mobile version