NTV Telugu Site icon

Rajamouli: స్టీవెన్ స్పిల్ బర్గ్ తో రాజమౌళి.. ఇది కదరా ఇండియన్ ప్రైడ్ మూమెంట్

Rajamouli

Rajamouli

Rajamouli: ఒకప్పుడు హాలీవుడ్ లో తెలుగు మూవీ గురించి కాదు కదా ఇండియన్ మూవీ గురించి మాట్లాడడం గొప్పగా ఫిల్ అయ్యేవారు. కానీ ఇప్పుడే అదే హాలీవుడ్ మూవీ మేకర్స్.. ఇండియన్ మూవీ.. అది ఒక తెలుగు మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం.. రాజమౌళి..ఆయన ప్రతిభ. బాహుబలితో ఇండియన్ మూవీని ప్రపంచానికి విస్తరించి.. ఆర్ఆర్ఆర్ తో ఆ ప్రపంచమే ఇండియన్ సినిమా గురించి మాట్లాడేలా చేశాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న విషయం తెల్సిందే. ఆ ఈవెంట్ లోనే రాజమౌళి.. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ స్టీవెన్ స్పిల్ బర్గ్ ను, జేమ్స్ కామరూన్ ను కలవడం, ఆర్ఆర్ఆర్ గురించి వారు పొగడడం జరిగింది. ఇదే పెద్ద అచీవ్ మెంట్ అనుకొంటే.. ఇంతకంటే పెద్ద అచీవ్ మెంట్ ను జక్కన్న అందుకున్నాడు.

Bedurulanka 2012 Teaser: భగవద్గీతలు బైబిల్లు వున్నవి.. యూజ్ చేసుకోవడానికే

ఒక టాలీవుడ్ డైరెక్టర్.. ఒక హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ను యూట్యూబ్ ద్వారా మీట్ అయ్యి ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి, ఇద్దరి అభిప్రాయాలను పంచుకున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళి అని చెప్పాలి. యూట్యూబ్ లైవ్ ద్వారా తమ తమ సినిమాల గురించి, ఇష్టాల గురించి,సినిమాల మేకింగ్ గురించి మాట్లాడుకున్నారు. ఆర్ఆర్ఆర్ ను ప్రశంసించడం, సీన్ సీన్ గురించి మాట్లాడడం అద్బుతంగా ఉంది. ఇక హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్ బర్గ్ ను ఇలా కలవడం అద్భుతంగా ఉందని,డ్యాన్స్ చేయాలనీ ఉందని రాజమౌళి అన్నాడు. స్టీవెన్ స్పిల్ బర్గ్ సినిమా ఫెబిల్ మెన్ రిలీజ్ సందర్భంగా జరిగిన ఈ లైవ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ వీడియో చూసినా వారందరు ఇది కదా ఇండియన్ ప్రైడ్ మూమెంట్.. ఒక హాలీవుడ్ డైరెక్టర్ తో మన జక్కన్న… సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.