NTV Telugu Site icon

Dj Tillu 2: ఈ గిఫ్ట్ ని ఫస్ట్ లుక్ అనుకోవచ్చా?

Dj Tillu 2

Dj Tillu 2

సిద్ధూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాని ఏ టైంలో అనౌన్స్ చేశాడో తెలియదు కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా ఆ ‘డీజే’ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. తెలుగు సినీ అభిమానులు ‘రాధిక’ అనే పేరుని,’డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ ని 2022 ఇయర్ మొత్తం రిపీట్ మోడ్ లో తలచుకోని ఉంటారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయ్యి, ఒక క్రేజీ క్యారెక్టర్ ని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చింది. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ మేకర్స్, ‘డీజే టిల్లు స్క్వేర్’ని అనౌన్స్ చేశారు. ‘డీజే టిల్లు’ సినిమాకి సీక్వెల్ గా ‘డీజే టిల్లు స్క్వేర్’ సినిమా రూపొందుతుంది. సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి  నుంచి టిల్లు స్క్వేర్ కి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ముందుగా దర్శకుడు విమల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో సిద్ధునే డైరెక్టర్ అవతారం ఎత్తాడు. డైరెక్టర్ సమస్య తీరిపోయింది అనుకుంటుంటే హీరోయిన్ సమస్య మాత్రం రిపీట్ అయ్యింది.

Read Also: Vishwak Sen: అనుకున్నంత పని చేశాడు…

ఎట్టకేలకు ముందుగా అనుకున్నట్లే అనుపమ పరమేశ్వరన్, సిద్ధూ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. అన్ని ఇష్యూస్ సాల్వ్ అయిపోవడంతో, Dj టిల్లు స్క్వేర్ సినిమా ఇటివలే సెట్స్ పైకి వెళ్లిన రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈరోజు సిద్ధూ పుట్టిన రోజు కావడంతో మేకర్స్ నుంచి ఒక బర్త్ డే స్పెషల్ పోస్టర్ బయటకి వచ్చింది. ఈ పోస్టర్ లో ‘స్టార్ బాయ్’ ఫ్లోరల్ డిజైన్ ఉన్న షర్ట్ వేసుకోని చాలా జోష్ లో కనిపిస్తున్నాడు. మాములుగా ఏ హీరో బర్త్ డే ఉన్నా… అతను ఆ సమయంలో ఏ మూవీ చేస్తున్నాడో, ఆ చిత్ర యూనిట్ నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని ఫాన్స్ కోసం రిలీజ్ చేస్తూ ఉంటారు మరి సిద్ధూ బర్త్ డేకి మేకర్స్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ని ఫస్ట్ లుక్ పోస్టర్ అనుకోవాలా? లేక ఇంకేదైనా పోస్టర్ ని స్పెషల్ గా ఫస్ట్ లుక్ అని రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.