Site icon NTV Telugu

Star Maa: ‘బ్రహ్మముడి’ సీరియల్ కి ఇండియాలోనే టాప్ రేటింగ్స్…

Star Maa

Star Maa

సినిమాల లెక్క ప్రతి శుక్రవారం మారుతూ ఉంటుంది కానీ సీరియల్ వ్యూవర్స్ మాత్రం చాలా లాయల్ గా ఉంటారు. ఒక సీరియల్ నచ్చితే దాన్ని ఒక నిమిషం కూడా మిస్ అవ్వకూడదని టైం అవ్వగానే టీవీ ముందు వాలిపోతారు. అలా ఇండియాలోనే అత్యధిక వ్యూవర్షిప్ రాబట్టిన తెలుగు సీరియల్ గా ‘బ్రహ్మముడి’ సీరియల్ హిస్టరీ క్రియేట్ చేసింది. స్టార్ మా ఛానెల్ లో ప్రతిరోజు సాయంత్రం 7:30 నిమిషాలకి టెలికాస్ట్ అయ్యే బ్రహ్మముడి సీరియల్ లో మానస్, దీపిక రంగరాజు మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. జనవరి నెల నుంచే మొదలైన బ్రహ్మముడి సీరియల్ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఇళ్లలో ప్రతిరోజు ఏడున్నరకి ప్లే అవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలోనే అత్యధికంగా వ్యూవర్షిప్ రాబడుతున్న టాప్ 5 తెలుగు సీరియల్స్ లో నాలుగు సీరియల్స్ స్టార్ మా నుంచే ఉండడం విశేషం. గుప్పెడంత మనసు, కృష్ణ ముకుందా మురారి, ఇంటింటి గృహలక్షీ సీరియల్స్ టాప్ వ్యూవర్షిప్ రాబడుతున్నాయి. ఈ సీరియల్స్ అన్నీ స్టార్ మా ఛానెల్ ని టాప్ ప్లేస్ లో నిలబెడుతున్నాయి.

Read Also: Ugadi Awards: కళ్యాణ్ రామ్ ఉత్తమనటుడు, శ్రీలేఖకు లతామంగేష్కర్ అవార్డు

Exit mobile version