Site icon NTV Telugu

Atharvaa : హిట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న స్టార్ కిడ్

Atharva

Atharva

తమిళ ఇండస్ట్రీలో మురళి అంటే లవ్ అండ్ శాడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. 80, 90స్‌లో విరహ ప్రేమ కథలకు ప్రాణం పోసిన నటుడాయన. మురళి చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ కావడంతో ఇక్కడి వారికి సుపరిచితమయ్యాడు. ఆయన నుండి నటనా వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అధర్వ. తండ్రిని మించిన తనయుడు అవుతాడు అనుకుంటే ఫాదర్‌ని మెస్మరైజ్ చేయడంలో తడబడుతున్నాడు.

Also Read : AA22xA6 : అల్లు అర్జున్ – అట్లీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

ఇప్పటి వరకు అధ్వర్వ  దాదాపుగా 20 సినిమాల్లో నటిస్తే పట్టుమని 5 చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ సౌండ్ చేయలేదు. 2010లో బానా కాతాడీతో తెరంగేట్రం చేశాడు అధర్వ. ఇందులో సమంత హీరోయిన్. బాలా పరదేశితో మంచి మార్కులు కొట్టేసిన అధ్వర్య, ఎట్టి, ఇమ్మైక నోడిగల్, 100 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచాయి. గద్దల కొండ గణేష్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఈ కోలీవుడ్ హీరో. ఈ సినిమా సక్సెస్ సాధించినా క్రెడిట్ వరుణ్ ఖాతాలో చేరిపోయింది. గద్దల కొంగ గణేష్ తర్వాత హిట్ అనే సౌండే వినలేదు అధర్వ. సుమారు ఏడేళ్ల నుండి విజయం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అతడి నెక్ట్స్ హోప్ డీఎన్ఎపైనే. నేడు థియేటర్లలోకి  వచ్చింది ఈ సినిమా. ఒకరోజు ముందుగా ప్రదర్శించిన మీడియా షోకు మంచి స్పందన లభించింది. అసలు టాక్ ఏంటనేది రెండు మూడు రోజులు ఆగితే కానీ తెలియదు. ఇవే కాకుండా ప్రజెంట్ అధర్వ పరాశక్తి, ఇదయం మురళి, అడ్రెస్‌తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలు హిట్ అయితే అథర్వ హిట్ ట్రాక్ లోకి  ఎక్కినట్టే.

Exit mobile version