Site icon NTV Telugu

Mishan Impossible : స్టార్ హీరోలను వాడేస్తున్న డైరెక్టర్

Mishan-Impossible

Mishan Impossible చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాప్సి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహించారు. ఈ హై-ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీలో హర్ష్ రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి అతిధి పాత్రలో నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగనున్నారు. Mishan Impossible ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని మేకర్స్ ప్రకటించారు.

Read Also : JGM: పూరీ డ్రీం ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్.. డెడ్లీ కాంబోలో వార్ స్టార్ట్

చిన్న సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ స్టార్ హీరోలందరినీ వాడేస్తున్నాడు. సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయగా, ఆయన తాజా చిత్రం “సర్కారు వారి పాట” సినిమా విడుదల తేదీ ఏప్రిల్ 1న విడుదల కావాల్సింది. కానీ పలు కారణాలతో పోస్ట్ పోన్ అయ్యింది. అయితే అదే తేదీని Mishan Impossible కబ్జా చేయడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక సినిమా కోసం నవీన్ పొలిశెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ అతిథిగా రావడం Mishan Impossibleకు కలిసొచ్చే అంశాలు. మరి ఏప్రిల్ 1న రానున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Exit mobile version