సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 సినిమా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం, మహేశ్ బాబు కెరీర్‌లో ప్రత్యేక స్థానం పొందనుంది. ఆయన సినిమా కోసం సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.. జుట్టు పెంచి, గుబురు గడ్డంతో, జిమ్‌లో కసరత్తు చేసి మరింత ఫిట్‌గా మారాడు. ఈ లుక్ పై ప్రేక్షకుల్లో చర్చ తీవ్రంగా కొనసాగుతోంది.
Also Read : Sai Pallavi : సాయిపల్లవికి తమిళనాడు ప్రభుత్వం నుంచి మరో గుర్తింపు!
ఈ పాన్-ఇండియా అడ్వెంచర్ డ్రామాలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా ప్రత్యేక విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విధంగా రూపొందుతోంది. మహేశ్ బాబు చేస్తున్న తొలి పాన్-ఇండియా చిత్రం కావడం వల్ల అంచనాలు అత్యధికంగా ఉన్నాయి. అయితే తాజా వార్తల ప్రకారం, SSMB29 సినిమాను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లేందుకు రాజమౌళి ప్రియాంక చోప్రాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే.. ప్రియాంకను ఓవర్సీస్ మార్కెట్‌లో ఫేస్ ఆఫ్ వాడటంపై దృష్టి సారిస్తున్నారట. ఈ క్రమంలో ఆమెకు ఆఫర్ అయిన రెమ్యునరేషన్, మహేశ్ బాబుకు ఇచ్చిన మొత్తాన్ని మించవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలిదు కానీ ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
