బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడ కనిపించినా ట్రెండ్ అవుతుందనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ముంబయిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జాన్వీ ఉత్సాహంగా అందరితో కలిసి నృత్యం చేస్తూ సందడి చేశారు. అయితే ఒక సందర్భంలో ఆమె ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించగా, సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ మొదలుపెట్టారు. “స్వాతంత్య్ర దినోత్సవం, కృష్ణాష్టమి వేరు.. ఈ సందర్భంలో ఆ నినాదం అవసరమా?” అంటూ విమర్శలు చేశారు. దీంతో ఈ ట్రోల్స్‌కి జాన్వీ సూటిగా స్పందించింది. తన ఇన్‌స్టా స్టోరీలో..
Also Read : SSMB29 : మహేష్ – రాజమౌళి మూవీ షూటింగ్ అప్‌డేట్.. !
‘‘అక్కడ పాల్గొన్నవారంతా ముందే ‘భారత్ మాతాకీ జై’ అన్నారు. తర్వాత నేను కూడా అన్నాను. కానీ వీడియోను కట్ చేసి నా మాటలనే వైరల్ చేస్తున్నారు. అయినా దేశాన్ని పొగడటానికి ఒక ప్రత్యేక రోజుకే పరిమితం కాదు. ప్రతిరోజూ నేను గర్వంగా ‘భారత్ మాతాకీ జై’ అంటాను’’ అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, ఈ వేడుకలో జాన్వీ మరాఠీలో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. తన రాబోయే చిత్రం ‘పరమ్ సుందరి’ (ఆగస్టు 29న విడుదల)ని తప్పక చూడమని అభిమానులను కోరింది. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
కాగా ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా – జాన్వీ కపూర్ జంటగా రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో నటించారు. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కేరళ అమ్మాయిగా, సిద్ధార్థ్ దిల్లీ అబ్బాయిగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలు పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్నాయి. ప్రత్యేకంగా “ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నా.. నిజమైన ప్రేమ ఒకరితోనే ఉంటుంది” అనే డైలాగ్ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంది.
