సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాట్టింగ్ కథని మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తాన”ని రాజమౌళి ఇప్పటికే చెప్పి SSMB 29 ప్రాజెక్ట్ పై ప్రపంచ సినీ అభిమానుల్లో అంచనాలు పెంచాడు. అవతార్, అవెంజర్స్, టెర్మినేటర్, ఇండియానా జోన్స్ తరహాలో ‘SSMB29’ని కూడా ఒక ఫ్రాంచైజ్ లా చెయ్యాలనేది జక్కన ప్లాన్ అనే వార్త ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. సీక్వెల్, ప్రీక్వెల్ అనేలా కాకుండా ఒక వరల్డ్ ని క్రియేట్ చేసి అందులో నుంచి సినిమా చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ అడ్వెంచర్ వరల్డ్ నుంచి వచ్చే సినిమాల్లో కథలు వేరుగా ఉంటాయి కానీ క్యారెక్టర్స్ మాత్రం రిపీట్ అవుతూ ఉంటాయట. ఇండియాలో ఇలాంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఫ్రాంచైజ్ లు ఉన్నాయి కానీ లార్జ్ స్కేల్ లో రూపొందిన ఫ్రాంచైజ్ లు అయితే లేవు.
అడ్వెంచర్ సినిమా చేసే సమయంలో, ఎన్నో ఇంటరెస్టింగ్ పాయింట్స్ పుడుతూ ఉంటాయి, కొత్త కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి, సినిమా సినిమాకి ఛాలెంజులు పెరుగుతూ ఉంటాయి, స్పాన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఒక యూనివర్స్ లోకి ఏ క్యారెక్టర్ ఎక్కడి నుంచైనా రావొచ్చు, దాని లీడ్ సినిమాని ఎటైనా టర్న్ చెయ్యొచ్చు. సో రాజమౌళి, మహేశ్ లు ఫ్రాంచైజ్ ని చేస్తున్నారు అనేది నిజమైతే… ఈ వరల్డ్ లో చాలా మంది హీరోలని, హీరోయిన్ లని, ఇంటరెస్టింగ్ సెటప్ లో రూపొందించిన సీన్స్ ని చూసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ తో కలిసి ‘SSMB 28’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక, రాజమౌళి -మహేశ్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవనుంది. దాదాపు 2023 డిసెంబర్ నుంచి ‘SSMB 29’ వర్క్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.
