టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. జనవరి 2న ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఫినిష్ చేసారు.
Also Read : Shriya Saran : చీరకట్టులో చెక్కిన శిల్పంలా శ్రియా శరణ్..
ఇక ఈ సినిమా క్యాస్టింగ్ పై శ్రద్ద పెట్టాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమాలో మహేశ్ తో పాటు మలయాళ స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ పేర్లు వినిపించాయి. కానీ అలాంటిదేమి లేదని పృద్విరాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక మహేశ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ లో పెరిగి హాలీవుడ్ లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రాను తీసుకున్నారని టాక్ కూడా వినిపించింది. ఇటీవల రాజమౌళి కీరవాణీతో దిగిన ఫోటో కూడా నెట్టింట వైరల్ గా మారడంతో ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే అందరూ అనుకున్నట్టు ప్రియాంక హీరోయిన్ కాదట. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా ఈ సినిమాలో లేడీ విలన్ గా నటిస్తుందట .అందుకు సంబందించిన లుక్ టెస్ట్ కూడా ఫినిష్ చేశారట. ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు పరిశీలిస్తున్నారట యూనిట్ వర్గాలు. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ను ఈ పాన్ ఇండియా సినిమాలో ఓ రోల్ కోసం సంప్రదింపులు చేస్తున్నారట.