NTV Telugu Site icon

SSMB 28: ఏ క్షణంలోనైనా అప్డేట్ ల్యాండ్ అవ్వొచ్చమ్మా… రెడీగా ఉండండి

Mahesh Rajamouli Ssmb 29

Mahesh Rajamouli Ssmb 29

అతడు, ఖలేజా సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రెండు సినిమాలు ఎప్పుడు టెలికాస్ట్ అయినా టీవీకి అతుక్కుపోతారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు టీవీలో హిట్ అయ్యాయి కానీ థియేటర్స్ లో మాత్రం ఆశించిన రిజల్ట్ ని ఇవ్వలేకపోయాయి. గతంలో రెండు సార్లు మిస్ అయిన హిట్ ని ఈసారి రీసౌండ్ వచ్చే రేంజులో కొట్టాలని ఈ డైరెక్టర్ అండ్ హీరో మరోసారి కలిసి SSMB 28 సినిమా చేస్తున్నారు. వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పై ఉన్న ఈ మూవీని సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. పూజా హెగ్డేతో పాటు శ్రీలీలా కూడా మహేశ్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో హిట్ బాకీని తీర్చేయాలని డిసైడ్ అయిన త్రివిక్రమ్, మహేశ్ ని మాస్ లుక్ లో చూపించనున్నాడు.

గతంలో SSMB 28 షూటింగ్ నుంచి కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి. వీటిలో మహేశ్ బాబు హెడ్ కి బ్యాండ్ కట్టుకోని మాస్ లుక్ లో ఉన్నాడు. తాజాగా SSMB 28 సెట్స్ నుంచి నటుడు జైరామ్ పోస్ట్ చేసిన ఫోటోస్ లో ఏమో మహేశ్ చాలా క్లాస్ గా ఉన్నాడు. లాంగ్ హెయిర్ తో మహేశ్ బాబు అటు క్లాస్ ఇటు మాస్… రెండు లుక్స్ ని చూపిస్తూ త్రివిక్రమ్ SSMB 28 సినిమా చేస్తున్నట్లు ఉన్నాడు. ఇదిలా ఉంటే ఉగాది రోజున SSMB 28 ఫస్ట్ లుక్ బయటకి వచ్చే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో ఒక రూమర్ గత కొంతకాలంగా వినిపిస్తునే ఉంది. ఆ మాటని నిజం చేస్తూ SSMB 28 అప్డేట్ ఏ క్షణంలోనైనా బయటకి రావొచ్చు, రెడీగా ఉండండి అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చేసింది. మరి ఉగాది పండగ సంధర్భంగా SSMB 28 నుంచి టైటిల్ ని అనౌన్స్ చేస్తారా లేక ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.