Site icon NTV Telugu

S. S. Rajamouli : షేక్‌పేట్‌లో ఓటు హక్కు వినియోగించిన రాజమౌళి దంపతులు

Rajamouli And Wife Rama Cast Their Vote In Shaikpet

Rajamouli And Wife Rama Cast Their Vote In Shaikpet

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల సందర్భంగా ఈ రోజు పోలింగ్‌ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైంది. సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగిస్తూ ప్రజలకు స్ఫూర్తినిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన భార్య రమ రాజమౌళితో కలిసి షేక్‌పేట్‌ డివిజన్‌లోని ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా, సాదాసీదాగా వచ్చిన రాజమౌళి దంపతులు ఓటు హక్కును వినియోగించారు.

Also Read : Dharmendra: సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనది. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది మన ఓటే. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలి. ఇది మన బాధ్యత మాత్రమే కాదు, మన హక్కు కూడా” అని అన్నారు. పోలింగ్‌ కేంద్రంలో రాజమౌళి దంపతులను చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కొందరు వారితో ఫొటోలు తీయడానికి కూడా ప్రయత్నించారు. ఎప్పుడు సినిమాలతో మాత్రమే ప్రేక్షకులను అలరించే రాజమౌళి ఈసారి ప్రజాస్వామ్య సందేశం ఇస్తూ, ఓటు వేయడం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేశారు.

Exit mobile version