Site icon NTV Telugu

Rajamouli: రజినీకాంత్ తో రాజమౌళి సినిమా.. రివీల్ చేసిన జక్కన్న

Ssr

Ssr

Rajamouli: ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో హీరోకైనా ఒక ఒక కోరిక ఉంటుంది.. జీవితంలో ఒక్కసారైనా దర్శక ధీరుడు రాజమౌళి దర్వకత్వంలో నటించాలని.. ఇక హీరోలు అలా అనుకోవడంలో కూడా తప్పు లేదు. ఇప్పటివరకు పరాజయం ఎరుగని దర్శకుడు జక్కన్న. తెలుగు సినిమాకు పాన్ ఇండియాను పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో భారీ విజయాన్ని అందుకున్న జక్కన్న తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు తో చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని, వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తున్నట్లు అందరికి తెల్సిందే. ఈలోపు జక్కన్న హిందీ సినిమా బ్రహ్మస్త్రను రిలీజ్ చేసే పనిలో పడ్డాడు. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను తెలుగులో రాజమౌళి రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి కూడా పాలు పంచుకుంటున్నాడు.

తాజాగా చెన్నె లో జరిగిన ప్రెస్ మీట్ లో జక్కన్న పాల్గొని సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజమౌళికి ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురయ్యింది. తమిళ్ ఇండస్ట్రీలో ఏ హీరోతో మేరుకు వర్క్ చేయాలనీ ఉంది అన్న ప్రశ్నకు.. రాజమౌళి మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరెక్ట్ చేయాలనీ ఉంది.. కనీసం ఒక్కరోజైనా ఆయనను డైరెక్ట్ చేయాలనీ ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ కాంబో కనుక నిజమైతే.. ఫ్యాన్స్ కు పెద్ద పండగే అని చెప్పాలి. వరల్డ్ సూపర్ స్టార్ తో వరల్డ్ సూపర్ డైరెక్టర్.. ఈ కాంబో కనుక కుదిరితే బాక్సాఫీస్ బద్దలు అయ్యినట్లే అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version