“పుష్ప” ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శక దిగ్గజం రాజమౌళి మాట్లాడుతూ తన ఫేవరెట్ డైరెక్టర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సుకుమార్ తన ఫేవరెట్ డైరెక్టర్ అని అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈరోజు నాకు కొంచం బాధగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. సుకుమార్ ఇక్కడ లేనందుకు బాధగా ఉంది… బాంబేలో ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడు. నా ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్. సుక్కూ అంటే నాకు చాలా ఇష్టం. మేము ఇద్దరం కంటిన్యూగా మెసేజులు పెట్టుకుంటూ ఉంటాము. మ్యూచువల్ అడ్మినిరేషన్ ఫ్యాన్ క్లబ్ మా ఇద్దరిదీ. ఏదన్నా మూవీ రిలీజ్ అయితే సుక్కూ అదిరిపోయింది అని నేను, నా మూవీ ఏదన్నా రిలీజ్ అయితే సర్ చింపేసారు అని తను కంటిన్యూస్ గా చెప్పుకుంటూ ఉంటాము. ఈ మధ్య పెట్టే మెసేజుల్లో సుకుమార్ ఎక్కువగా సర్ టైం సరిపోవట్లేదు అని పెడుతుంటే… నేను నేనేం చెప్పానంటే… సుక్కూ జస్ట్ బిలీవ్ ప్రోడక్ట్… నువ్వు చేయగలిగేదంతా ఈ సినిమా కోసం చేసేయి. మిగతాది దానంతట అదే జరుగుతుంది అన్నాను. దానికి తగ్గట్టుగానే సెకండ్ కూడా గ్యాప్ లేకుండా రాత్రి, పగలూ తేడా లేకుండా పని చేస్తున్నాడు. సినిమా ఖచ్చితంగా అద్భుతంగా వస్తుందని నాకు నమ్మకం ఉంది” అంటూ సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
