NTV Telugu Site icon

SS Rajamouli: ఆర్ఆర్ఆర్ టీమ్లో ఆరుగురికి ఆస్కార్ ఆహ్వానం.. జక్కన్న రియాక్షన్ ఇదే!

Ss Rajamouli On Rrr Team In

Ss Rajamouli On Rrr Team In

SS Rajamouli Response on RRR Team invited to Oscars : ఆస్కార్ అవార్డుతో అంత‌ర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందిన `ఆర్ఆర్ఆర్‌` సినిమా యూనిట్ కి తాజాగా మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఇప్ప‌టికే ఎన్నో అవార్డులు అందుకున్న ఈ సినిమా యూనిట్ లోని ఆరుగురికి ఏకంగా ఆస్కార్ క‌మిటీలో అవకాశం ల‌భించింది. వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల ప్యానల్ క‌మిటీ స‌భ్యులుగా `ఆర్ఆర్ఆర్‌` చిత్రానికి చెందిన ఆరుగురు ఎంపిక‌య్యారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే ‘ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్తగా ఆస్కార్ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించగా అందులో ‘ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కు చెందిన ఆరుగురు ఉన్నారు.

Comedian Satya: ‘రంగబలి’ కోసం ‘సత్యబలి’.. వాళ్లలో ఎవరినీ వదల లేదుగా!

హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, సినిమాటోగ్రఫర్ సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సిరిల్ ఉన్నారు. ఈ క్రమంలో దీంతో సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ విషయం మీద రాజమౌళి స్పందిస్తూ ఈ సంవత్సరం అకాడమీ అవార్డుల కోసం మా ఆర్ఆర్ఆర్ బృందంలోని 6 మంది సభ్యులు సభ్యులుగా ఆహ్వానించబడినందుకు చాలా గర్వంగా ఉంది, తారక్, చరణ్, పెద్దన్న, సాబు సర్, సెంథిల్ & చంద్రబోస్ గారూ అభినందనలు, అలాగే, ఈ సంవత్సరం ఆహ్వానం అందుకున్న భారతీయ సినిమా సభ్యులకు అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక ఇండియా నుంచి వీరికి మాత్రమే కాక మరికొందరికి కూడా ఆస్కార్ కమిటీ ఆహ్వానం పలికింది. తమిళ `డైరెక్టర్ మణిరత్నం, కరణ్ జోహార్ కు కూడా ఆస్కార్ కమిటీ ఆహ్వానం పలికింది. అయితే వారితో పాటు దర్శక ధీరుడు రాజమౌళికి కూడా స్థానం కల్పించి ఉంటే బాగుండేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Show comments