SS Rajamouli Comments about Baahubali: Crown of Blood Main Charecter: ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టించిన బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా ఇప్పుడు ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో ఈ కథలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ను గ్రాఫిక్ ఇండియా, అర్క మీడియా బ్యానర్స్ పై దర్శకుడు S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్, శోభు యార్లగడ్డ నిర్మించగా జీవన్ జె. కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ మే 17వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుండగా ఈ రోజు మీడియాకు ఈ యానిమేషన్ సిరీస్ నుంచి రెండు ఎపిసోడ్స్ స్క్రీనింగ్ చేశారు. ఇక అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళిని మీడియా ప్రతినిధి ఒకరు ఈ యానిమేటెడ్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత బాహుబలి సహా మిగతా పాత్రధారుల మోకాలు ఏవి సినిమాలో నటించిన వారి ముఖాల్లాగా అనిపించడం లేదని అన్నారు.
Rajamouli: ‘బాహుబలి’ని మీరే చంపుకుంటున్నారా ? అంటే జక్కన్న సమాధానం ఇదే!
అలాగే వాయిస్ కూడా పూర్తిస్థాయిలో ఏమాత్రం మ్యాచ్ కావడం లేదని అంతేకాక ముఖ్యంగా బాహుబలి ముఖం అయితే ధోని ముఖకవళికలతో ఉన్నాయని మీకు ధోని అంటే ఇష్టం కాబట్టి ఆయన ముఖంతోనే క్యారెక్టర్ డిజైన్ చేశారా అని అడిగారు. అయితే దానికి రాజమౌళి స్పందిస్తూ నిజానికి క్రియేట్ చేసిన వాళ్ళకి కూడా ధోని అంటే ఇష్టమేమోనని అందుకే ఆయన మీద ప్రేమతో అలా క్రియేట్ చేసి ఉంటారని సరదాగా కామెంట్ చేశారు. ఇక ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ నిజానికి ఈ కాన్సెప్ట్ కూడా నేనే చేయాల్సి ఉంది కానీ నాకు సమయా భావం వల్ల చేయలేకపోయాను, మనకి ఎంత ప్రేమ ఉన్నా ఎంత కన్సర్న్ ఉన్నా కొన్ని పరిధి దాటిన తర్వాత మన నెక్స్ట్ లెవెల్ క్రియేటర్స్ కి చేయాల్సిందే. అలాగే దీనికి ఇచ్చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు పర్ఫెక్ట్ గానే క్రియేట్ చేశారని నేను నమ్ముతున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.