Site icon NTV Telugu

ఏది పడితే అది తీస్తే పాన్ ఇండియా అవ్వదు : రాజమౌళి

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ యొక్క ‘ బ్రహ్మాస్త్రా ‘ సెప్టెంబర్ 9, 2022న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా మరియు నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూడు భాగాల ఫ్రాంచైజీ చిత్రంలో మౌని రాయ్ నెగిటివ్ లీడ్‌లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రెస్ మీట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి పాన్ ఇండియన్ సినిమాల గురించి మాట్లాడారు.

Read Also : ‘పుష్ప’రాజ్ పై సైబరాబాద్ పోలీస్ హిలేరియస్ మీమ్… ‘తగ్గేదే లే’!

“పాన్ ఇండియన్ ఫిలిమ్స్ గురించి మాట్లాడితే… ఏ సినిమా పాన్ ఇండియన్ ఫిల్మ్ అవుతుంది ? అంటే వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంటేనా? భారీ బడ్జెట్ ఉంటే అవుతుందా?… ఒక సినిమా పాన్ ఇండియా సినిమా ఎలా అవుతుంది ? అనేది మనకు ఎలా తెలుస్తుంది? ‘బాహుబలి’ తీసినా కూడా… నా సినిమాల పరంగా మాత్రం నేను చెప్పగలను ఏ సినిమా పాన్ ఇండియా అవుతుందని. అయాన్ సినిమా రషెష్ చూపించినప్పుడు… అందులో ఎక్కడా డైలాగ్ లేదు. అక్కడక్కడా బ్యాడ్ పైలెట్ ట్రాక్ ఉంది. బెంచెస్ ఆఫ్ సీక్వెన్స్ ఉన్నాయి. నాకు హిందీ రాకపోవడంతో అయాన్ నాకు ట్రాన్స్ లేట్ చేస్తున్నాడు. నేను అలా నాకు అలా అనువదించాల్సిన అవసరం లేదని చెప్పాను. భాషతో సంబంధం లేకుండా సినిమా అర్థమవుతుంది అంటే అదే పాన్ ఇండియన్ సినిమా” అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.

Exit mobile version