Sriya Reddy:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో అందరూ ఆశ్చర్యపోయే ప్రొడక్షన్ వేల్యూస్‌తో సినిమాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. మోస్ట్ అవెయిటెడ్ మూవీగా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అనేంత రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేస్తోంది. సలార్ సీజ్ ఫైర్ రిలీజ్ అయ్యాక రాధారమ పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఆ పాత్రలో నటించిన శ్రేయా రెడ్డి.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇక సలార్ రిలీజ్ అయ్యాకా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అసలు సలార్ ఒరిజినల్ స్క్రిప్ట్ లో రాధారమ పాత్ర లేనే లేదని చెప్పి బాంబ్ పేల్చింది.
” ప్రశాంత్ నీల్ సింపుల్‌గా సలార్ గురించి చెప్పినప్పుడు ముందు వద్దన్నాను. కానీ ఆ సమయంలో నేను సినిమాలు చేయకూడదని అనుకున్నాను. అయితే నీల్ మాత్రం తన పట్టు వదల్లేదు. నన్ను నటించాలన్నారు. ఓసారి స్క్రిప్ట్ విని నిర్ణయం తీసుకోమని అన్నారు. హీరో ఎవరైనా పర్లేదు. నా క్యారెక్టర్‌కి ప్రాధాన్యం ఉండాలని చెప్పాను. లేదు నీ రోల్ చాలా బావుంటుంది నన్ను నమ్ము అన్నారు.. నిజానికి ఒరిజినల్ స్క్రిప్ట్‌లో నా క్యారెక్టర్ లేదు. అయితే ప్రశాంత్ నీల్‌గారు సలార్ మీద వర్క్ చేస్తున్నప్పుడు లేడీ విలన్ ఉంటే బావుంటుందని భావించారు.నీల్‌గారికి నా పాత్రను ఏదో విలనీగా, అరుస్తున్నట్లు చూపించాలనే ఉద్దేశం లేదు. విలనిజం టచ్ ఉంటూనే అందంగా కనిపించేలా నా పాత్రను ఆయన డిజైన్ చేసుకున్నారు. ముందు నుంచి అదే విషయాన్ని ఆయన చెబుతూ వచ్చారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.