Sriram: రోజా పూలు, ఒకరికొకరు సినిమాలతో తెలుగువారికి పరిచయమయ్యాడు శ్రీకాంత్ శ్రీరామ్. ఇక ఈ మధ్య పిండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది కానీ, శ్రీరామ్ కు మంచి అవకాశాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం హీరోగా, సపోర్టివ్ రోల్స్ చేస్తూ బిజీగా మారాడు. ఇక తాజాగా శ్రీరామ్ దావత్ అనే షోలో పాల్గొన్నాడు. ఇక ఈ షోలో శ్రీరామ్ తన మనోగతాన్ని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా హీరోయిన్స్ గురించి తనదైన పద్దతిలో చెప్పుకొచ్చాడు. శ్రీరామ్ భార్య వందన గురించి చెప్పుకొచ్చాడు. మీ భార్య మీకన్నా అందంగా ఉంటుంది కదా.. మీకెప్పుడైనా అసూయగా అనిపించిందా.. ? అన్న ప్రశ్నకు శ్రీరామ్ మాట్లాడుతూ.. అలా ఏం లేదు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అలాంటి అందమైన అమ్మాయి ప్రేమను పొందినందుకు.. అందరూ నన్ను చూసి కుళ్ళుకుంటారు కదా అని చెప్పుకొచ్చాడు. ఇక ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం చెప్పుకొచ్చాడు.
మీకు ఎవరిని చూసి ఓరి దీని వేషాలో అని అనాలనిపించింది అని అడగ్గా.. ఇలియానాను చూసి అని చెప్పుకొచ్చాడు. ” స్నేహితుడు సినిమా సమయంలో అందరికి 7 గంటలకే షూటింగ్ టైమ్. విజయ్ అయితే అరగంట ముందే ఉండేవాడు. కానీ, ఇలియానా వచ్చేసరికి 11, 12 అయ్యేది. షాట్ కు వచ్చాకా కూడా ఇంకో అరగంట హెయిర్ ను అడ్జెస్ట్ చేయడానికి , ఒక నలుగురు ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఇక మేము అందరం త్వరగా వస్తే.. షాట్ చేసేసి తినొచ్చు అనేలా అలిసిపోయి ఆమెనే చూస్తూ కూర్చున్నాం. అప్పుడు అని అనిపించింది.. ఆమె ఓవర్ చూసి .. ఓసి నీ.. ఏందిరా దీని వేషాలు అని చెప్పుకొచ్చాడు. ఇక త్రిష, తాను క్లోజ్ ఫ్రెండ్స్ అని, వందన తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని తెలిసీ.. ఆమె దగ్గరకు వెళ్లి.. ఎలా ఒప్పుకున్నావ్.. వీడో పెద్ద వేస్ట్ గాడు.. చదువు రాదు, ఇంగ్లీష్ రాదు.. అని చెప్పింది. నా ఫ్రెండ్ అయ్యి ఉండి నా పెళ్లే చెడగొట్టాలని చూసిందని చెప్పుకొచ్చాడు.
